అధికారపక్షం తో పాటు ప్రతిపక్షాలు కూడా ఏపీ లోని నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకున్నాయి. చంద్రబాబు సర్కారు మీద జనం లో ఉన్న కాస్తో కూస్తో వ్యతిరేకత ని క్యాష్ చేసుకుని ఈ ఉప ఎన్నికలో తమ సత్తా చూపించాలి అని వైకాపా చాలా బలంగా ఉంది. టీడీపీ ని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి రాబోయే 2019 ఎన్నికల టైం కి తాము దూసుకుని పోవాలి అనేది వైకాపా వేస్తున్న అతిపెద్ద స్కెచ్.


నంద్యాల మీద వ్యూహాలూ ప్రతి వ్యూహాలు రచిస్తున్న టైం లో దళితుల లో పట్టు సాధించింది వైకాపా. టీడీపీ కూడా మరొక పక్క చాలా ప్లాన్ లే వేస్తోంది. భూమా ఫామిలీ మీద సింపతీ ఉంది కాబట్టి అది తమని గట్టు ఎక్కించేస్తుంది అనే లెక్కలో చంద్రబాబు ఉన్నారు. ద్విముఖంగా జరుగుతుంది అనుకున్న ఈ ఎన్నిక త్రిముఖం కాబోతోంది.


మ‌ధ్య‌లో కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అయిపోయింది. నంద్యాల‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని పోటీకి పెడుతున్న‌ట్టు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి ప్ర‌క‌టించారు. గత ఎన్నికల్లో జూపల్లి రాజశేఖర రెడ్డి ని కాంగ్రెస్ అభ్యర్ధి గా దింపగా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా కానీ ఏదో కొత్త ధైర్యం తో కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ పోటీ కి దిగుతోంది.


నంద్యాల లో పరిస్థితి మారిపోయింది అనీ తమకి ఫేవర్ అవుతుంది అనేది రఘువీర ధీమా, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ని చీల్చడం కోసం తప్ప ఈ పార్టీ నిల్చోవడం ఏమీ ఉపయోగం లేదు. అంటే కాంగ్రెస్ జగన్ కి ఓట్లు తగ్గిస్తుంది తప్ప తమ ని గెలిపించుకునేలా కనపడ్డం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: