తెలంగాణా తెలుగుదేశం లో ఇప్పటికీ ఎవరైనా యాక్టివ్ గా ఉన్నారా అంటే అది రేవంత్ రద్దీ ఒక్కరే. ఆయన కి ఓటుకు నోటు పుణ్యమా అని చాలా పేరొచ్చింది, మీడియా హైప్ కారణం కావచ్చు , జైలుకి వెళ్లి రావడం వలన కావచ్చు రీజన్ ఏదైనా రేవంత్ రెడ్డి హడావిడి అప్పట్లో భారీగా ఉండేది. ఇప్పుడు ఆయన ఉనికిని ఆయనే కాపాడుకోవడం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ ని తెలంగాణా లో తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. తెరాస ని అధికారం నుంచి దించడమే తన కర్తవ్యంగా చెప్పే రేవంత్ దాదాపు ఎప్పుడూ కెసిఆర్ మీద ఏదో ఒక రకంగా సవాళ్లు , విమర్శలు చేస్తూనే ఉంటారు. అలాంటిది తెరాస‌తో టీడీపీ పొత్తు అంటే ఎలా ఉంటుంది..? తెరాస నేత‌ల‌తో రేవంత్ క‌లిసి చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ఎలా ఉంటుంది..? గ‌తంలో ఓసారి ఇలాంటి ప్ర‌తిపాద‌నే రేవంత్ ముందుకు కొంత‌మంది తీసుకొస్తే నిప్పులు తొక్కిన‌ట్టు చిందేశారు. 


అలాంటి రేవంత్ కి ఇప్పుడు తెరాస తో కలిసి పని చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాచలం లో ఒక ఆసక్తికర రాజకీయ అనుభవం ఎదురుకొన్నారు రేవంత్ రెడ్డి. అక్కడ జరిగిన ఒక పేపరు మిల్లు కి సంబందించిన ఎన్నికల ప్రచారం లో రేవంత్ వెళ్ళగా కార్మిక విభాగం టీఎన్టీయూసీకి టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తోంద‌క్క‌డ‌. దీంతోపాటు తెరాస‌, వైకాపాలు కూడా ఆ విభాగానికి స‌పోర్ట్ చెయ్య‌డం విశేషం. ఈ ఎన్నికల్లో ఒక పక్క వైకాపా తో మరొక పక్క తెరాస నాయకుడితో ప్రచారం చేసారు రేవంత్. రెండు పార్టీల నేత‌ల మ‌ధ్యా ప‌సుపు కండువా క‌ప్పుకుని రేవంత్ ప్ర‌చారం చేయ‌డం సీన్ చూసిన‌వారంతా విచిత్రంగా ఫీల‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: