దివాకర్ రెడ్డి ట్రావెల్స్ అంటే ఈ బస్సుల్లో ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోయిన ఎందరో బాధితులు గుర్తుకు వస్తారు. పాలేరు ప్రమాదం, మూలపాడు ప్రమాదం ఈ రెండూ ఆ బస్సుల యొక్క క్షేమ వ్యవహారం గురించి చెప్పడానికి ఇవి సరిపోతాయి. కాంగ్రెస్ లో మొన్నటి వరకూ ఉన్న జేసీ దివాకర్ రెడ్డీ ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల టైం కి టీడీపీ లో చేరిన సంగతి తెలిసిందే.


వారిద్దరికీ టికెట్లు ఇవ్వడం విషయం లో కూడా టీడీపీ ప్రాధాన్యత చూపించింది. కానీ ఇప్పుడు వారి బస్సుల దెబ్బకి ఏపీ ప్రభుత్వానికే తలనొప్పి వ్యవహారం పెరుగుతోంది. వరస ప్రమాదాల తో జనాల ప్రాణాలు తీస్తున్న ఈ బస్సుల మీద హై కోర్టు లో ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తో పాటు తెలంగాణా సర్కారు కూడా కౌంటర్ దాఖలు చెయ్యాలి అని హై కోర్టు డివిజన్ బెంచ్ రెండు ప్రభుత్వాలకీ ఆదేశాలు ఇచ్చింది. వెంటనే రెండు రాష్ట్రాలూ కౌంటర్ దాఖలు చెయ్యగా ఈ పిటీషన్ లని హై కోర్టు పరిశీలించింది.


ఏపీ పిటీషన్ చూసి ఆశ్చర్యపోయిన కోర్టు ఏపీ తరఫున అడ్వకేట్ గా ఉన్న దమ్మాల పాటి శ్రీనివాస్ కి అక్షించాలు వేసింది. దివాకర్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలు లేకుండా నడుస్తున్నాయి అని తెలంగాణా సర్కారు పిటీషన్ లో పేర్కొనగా ఏపీ ప్రభుత్వం మాత్రం అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని తమ పిటీషన్ లో రాసింది. ఈ దెబ్బతో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ , జస్టిస్ రజని లు ఏపీ సర్కారు మీద సీరియస్ అయ్యారు.


ఒక పక్క తెలంగాణా సర్కారు ఆ బస్సులు అంతా అక్రమం అంటూ చెబుతుంటే మీరెలా పర్ఫెక్ట్ అంటారు అని సీరియస్ అయ్యింది ధర్మాసనం.అదే సమయంలో ఏపీ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దమ్మాలపాటి కోరగా... మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: