kcr cbi cases on esi scam కోసం చిత్ర ఫలితం


తెలంగాణా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర్‌రావు మెడకు చుట్టుకున్న కేసుల భయం తోనే ప్రధానమంత్రి మోదీకి మోకరిల్లుతున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు సీఎం అయిన తర్వాత నాలుగుసార్లు కేసీఆర్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారని చెప్పారు. ఈ సీబీఐ కేసుల నుంచి రక్షించు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం పాదాల వద్ద కేసీఆర్‌ తాకట్టు పెట్టారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

kcr cbi cases కోసం చిత్ర ఫలితం


సీఎం కేసీఆర్‌ వైఫల్యం వల్లే రాష్ట్రంలో నగదు కొరత ఏర్పడిందని, రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మండి పడ్డారు. తెలంగాణపై జీఎస్టీ వల్ల 20వేల కోట్ల అదనపుభారం పడుతుందన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్‌ ఉన్నప్పుడు:

*ఈఎస్‌ఐ ఆసుపత్రుల కుంభకోణంలోనూ, 
*సహారా ఇండియాకు చెందిన ప్రావిడెంట్‌ఫండ్‌ కుంభకోణంలోనూ కేసీఆర్‌ పై: 


kcr cbi cases కోసం చిత్ర ఫలితం

సీబీఐ కేసులను నమోదుచేసిందని వివరించారు. ఈ కేసులు ఇప్పటికీ  కేసీఆర్‌పై విచారణలో  ఉన్నాయని, మద్రాసు నుంచి 20 మందికి పైగా సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు నాలుగు సార్లు వచ్చి ప్రశ్నించారని రేవంత్‌ రెడ్డి చెప్పారు. దీనికి సంబందించి వార్త లేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. ఈ కేసుల భయం తోనే ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరి కంటే ముందుగా అడిగిందే తడవుగా కేసీఆర్‌ మద్ధతును ఇస్తున్నాడని చెప్పారు. ప్రధాని నమో పేరు వినపడి తే  సీఎం కేసీఆర్‌కు మోకాళ్లు వణుకుతున్నాయని ఎద్దేవా చేశారు.


kcr cbi cases కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: