minister for civil aviation కోసం చిత్ర ఫలితం


ప్రభుత్వరంగ విమానయాన దిగ్గజసంస్థ ఎయిరిండియాలో తమ వాటాలు విక్రయించాలని కేంద్రప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో ఆకంపెనీని కొనుగోలు చేసేందుకు అనేక ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఎయిరిండియా అంతర్జాతీయ విమానాలను (ఫ్లైట్స్‌) కొనగోలు చేయడంపై తమ ఆసక్తి వ్యక్తీకరిస్తూ చౌక టికెట్ ధరల విమాన యానసంస్థ ఇండిగో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు తమ ఇష్టాన్ని వ్యక్తీకరిస్తూ ఆఫర్ తో లేఖ రాసింది.



air india for sale కోసం చిత్ర ఫలితం


ఎయిరిండియా అంతర్జాతీయ కార్యకలాపాలతో పాటు చౌక టికెట్ ధరల విభాగం "ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌" ను కూడా కొనుగోలు చేయడంపై తమ ఆసక్తిని ఇండిగో  వ్యక్తం చేసింది. ఒకవేళ అలా కుదరకపోతే "దేశీయ కార్యకలాపాలు సహా మొత్తం ఎయిరిండియా ఫ్లయిట్‌ కార్యకలాపాలన్నింటినీ కొనుగోలు చేసేందుకు సిద్ధమని"  ఇండిగో ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ లేఖలో పేర్కొన్నట్లు పౌర విమానయాన శాఖకార్యదర్శి ఆర్‌.ఎన్‌ చౌబే తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన పలు ప్రైవేట్‌ సంస్థలు ఎయిరిండియా కొనుగోలు విషయంలో తమను సంప్రదించిన ప్పటికీ అవన్నీ అనధికారిక చర్చలేనని, అధికారికంగా ఇండిగో ఒక్కటే తమ ఆసక్తి లేఖ ద్వారా పంపిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు.


air india authotities కోసం చిత్ర ఫలితం


దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంంగి కునారిల్లుతున్న ఎయిరిండియాలో తమ వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి బుధవారం సూత్ర ప్రాయంగా ఆమోదముద్ర వేసింది. కంపెనీ కొనుగోలుకు ఇప్పటికే "టాటా గ్రూప్‌" ఆసక్తిని వ్యక్తపరచింది.  ఎయిరిండియా వ్యాపారాన్ని కొనుగోలుపై ఆసక్తి చూపిన వార్తలతో గురువారం ఇండిగో మాతృసంస్థ "ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌" షేరు వ్యాల్యూ సుమారు 2 శాతం నష్టపోయింది. బీ.ఎస్‌.ఈ, ఎన్‌.ఎస్‌.ఈ.  ల్లో రూ.1,237 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ రూ.918 కోట్లు క్షీణించి రూ.44,730 కోట్లకు తరిగిపోయింది.


ఎయిరిండియా కంపెనీకి భారీ ఆస్తులు, ఎయిరిండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్, ఎయిరిండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్, అలయన్స్‌ ఎయిర్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన ఉపసంస్థలు ఎయిరిండియా కు అనుబంధ కంపెనీలుగా ఉన్నాయి. ఇవే కాకుండా దేశ విదేశాల్లో ఎయిరిండియాకు పలు ఆస్థులు, అమూల్యమైన ఆర్ట్‌వర్క్, సుశిక్షితులైన సిబ్బంది, నిర్మాణాత్మకంగా వ్యవహరించే రకరకాల వెండార్స్, ఎనిమిది దశాబ్ధాలుగా స్థిరపడ్డ వ్యక్తులు, వ్యవస్థ లు వివిధ వ్యాపార సంభందాలు ఉన్నాయి. 


Jayant Sinha


అంతర్జాతీయంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలకు 41 నిర్దేశిత మార్హాల్లో ఎయిరిండియా ఫ్లయిట్‌ సర్వీసు లు నిర్వహిస్తోంది. దేశీయంగా ఈశాన్యరాష్ట్రాలు, అండమాన్‌-నికోబార్‌ దీవులు మొదలైన మారుమూలలకూ సర్వీసులు సేవలు ఉన్నాయి.


కంపెనీని దారికి తెచ్చి గాడినపెట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిష్ఠ ను దిగజార్చే విధంగా "సోషల్‌ మీడియాలో పోస్టులు లాంటివి పెడితే కఠిన చర్యలు ఉంటాయని" మాజీ ఉద్యోగులను ఎయిరిండియా హెచ్చరించింది. అలాంటివి గానీ చేస్తే " విశ్రాంత అంటే రిటైర్మెంట్‌ ప్రయోజనాలను" ఉపసంహరించే పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఎయిరిండియా ప్రయోజనాలను పొందుతున్న మాజీఉద్యోగులు, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే వ్యతిరేక వ్యాఖ్యలేమైనా చేస్తే ప్రతికూల పరిణామాలు తప్పవని జూన్‌ 21న అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసింది. 


సంబంధిత చిత్రం


ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో కొందరు రిటైర్డ్‌ ఉద్యోగులు నెగటివ్‌ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తమ దృష్టికి ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


"ఎయిరిండియా భవిష్యత్‌ ప్రణాళిక" పై చర్చల కోసం ఏర్పాటయ్యే మంత్రుల అధికారుల బృందం, -ప్రైవేటీకరించిన అనంతరం కూడా అదే పేరు కొనసాగించాలా?  లేక కొత్త పేరుతో రీబ్రాండింగ్‌ చేయాలా? వంటి అంశాలను కూడా తాము నిశితంగా పరిశీలించనున్నట్లు పౌర విమానయాన శాఖకార్యదర్శి ఆర్‌.ఎన్‌ చౌబే తెలిపారు.


Minister of State for Culture (Independent Charge), Tourism (Independent Charge) and Civil Aviation


ఎయిరిండియా కంపెనీ వర్గాల ప్రకారం "ఎయిరిండియా వ్యాపార ప్రతిష్ఠ విలువ" (బ్రాండ్ వ్యాల్యూ) చాలా భారీ గానే ఉండా లని భావించటానికి కారణం "ఆరేళ్ల కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ విలువ" ఒక దశబ్ధం అనుభవంలేకుండా యాజమాన్య అప్రతిష్ఠలో దిగజారిన కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ విలువే కనిష్ఠంగా రూ.3500 కోట్ల వ్యాల్యుయేషన్‌ కట్టినప్పుడు, ఏకం గా 80 ఏళ్ల చరిత్ర గల "ఎయిరిండియా బ్రాండ్‌ విలువ" ఎంత? భారీగా ఉండాలన్నది ఊహించుకోవచ్చు- అని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

civil aviation secretary r n choubey కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: