sireesha & si కోసం చిత్ర ఫలితం


బ్యూటీషియన్ శిరీష మరణానికి సబ్-ఇన్స్పెక్టర్ ప్రభాకరరెడ్డి మరణానికి అసలేమైనా సంబందం ఉందా? ఆత్మహత్యలుగా చెపుతున్న ఈ రెండూ మరణాల్లోని మర్మం పోలీసుల విచారణను అనుమానాస్పదం చూస్తున్నాయి ప్రశ్నిస్తున్నాయి. అసలు పోలీసులు "పరిస్థితులకు సంభందించిన సాక్ష్యం" అంటే సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ నుండి విచారణే చెపట్టిన దాఖలాలే కనిపించటం లేదు. 


*ఆరడుగులు ఎత్తు 80 కిలోల బరువున్న అమ్మాయి చున్ని తో ఒక సీలింగ్ ఫాంకు ఉరేసుకుంటే ఆ ఫాన్ ఆ ఎత్తుకు ఎలా పొందింది? 
*ఆ భారానికి ఎందుకు చెక్కు చెదరలేదు? 

ఈ రెండు ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం చెప్పవరకు ఈ ఆత్మహత్యలు లేదా హత్యల నిర్ధారణ జరగనట్లె. 


sireesha & si కోసం చిత్ర ఫలితం


ఆమె మరణానికి సంబంధించి నాటకీయ పరిణామాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తొలుత అనుమానాస్పద మృతిగా పేర్కొన్న పోలీసులు, తర్వాత ఆత్మహత్యగా పేర్కొన్నారు. అయితే, శిరీష మరణంపై ఆమె బంధువులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఇలాంటి సమయం లో ఆమె లోదుస్తుల మీద మరకలు ఉన్నట్లుగా పేర్కొన్న నివేదిక శిరీష మరణంపై మరిన్ని అనుమానాలకు గురిచేసేలా చేశాయి. మరోవైపు, శిరీషది ఆత్మహత్యేనని పోలీసులు చెబుతున్నారు. అలా ఐతే పై రెండు ప్రాధమైక అనుమానాలకు పోలీసుల సమాధానమేమిటి? 


ఆమె మరణంపై ఎవరికైనా సందేహాలు ఉంటే, తమ వద్దకు రావాలని, నివృతి చేస్తామని చెబుతున్నారు పోలీసులు. దానికి బదులు పై రెండు ప్రాధమిన అనుమానాలకు ఒక ప్రకటన ద్వారా సమాధానమిస్తే ప్రజల అనుమానమే కాదు వారి ఉటుంబ సభ్యుల అనుమానాలు నివృత్తి ఔతాయి కదా! 


sireesha & si కోసం చిత్ర ఫలితం


తాజాగా శిరీష భర్త సతీష్ చంద్ర ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అభిప్రాయపడుతున్నారు. శిరీష మరణ ప్రభావం నుండి బయటకు రాని ఆయన, తాజాగా మాత్రం పోలీసుల విచారణ ప్రవర్తన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణనే తప్పు పడుతున్నారు. శిరీషను అక్కడే హత్యచేసి స్టూడియోకి తెచ్చి ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్కమస్టాన్షియల్ ఎనిడెన్స్ ఆయన అభిప్రాయాన్నే దృవపరుస్తున్నట్లు సాధారణ పరిఙ్జాననున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. 


sireesha husband satish chandra కోసం చిత్ర ఫలితం


పోలీసులు చెబుతున్న వాదనలో పసలేదని నిజం అసలేలేదని, శిరీషను చంపి హైదరాబాద్ తీసుకొచ్చి ఉంటారన్నారు. ఆపదలో ఉన్నందునే తాను ఎక్కడ ఉన్నాననో తెలిపేందుకే శిరీష లొకేషన్ షేర్ చేసిందని తన నమ్మకమని ఆయన అన్నారు.

*శిరీష లొకేషన్ షేర్ చేసిన తర్వాత కూడా బతికే ఉందని పోలీసులు నిర్ధారించి చెప్పగలరా?  
*ఆధారాలు ఏమైన చూపించగలరా? .
*రాత్రి 01.40 గంటల తర్వాత కూడా శిరీష బతికి ఉందన్న దానికి కనీస ఆధారాలు చూపించగలరా?
*కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ వద్దా, ఆర్ జే స్టూడియో వద్ద ఉన్న సీసీ కెమేరాలు ఎందుకు  పని చేయలేదు?
*కీలక సమాచారాన్ని అందించే రెండు ప్రదేశాల్లోనూ అదే సమయం లో కెమేరాలు పని చేయకపోవటం యాదృశ్చికంగా జరిగిందా?  ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా?
*కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు వాస్తవాలు చెప్పకుండా, శిరీష క్యారెక్టర్ మీదే  "ఫోకస్" ఎందుకు పెడుతున్నారు? 


sireesha husband satish chandra కోసం చిత్ర ఫలితం


అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమేరాలు పనిచేస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. ఇందులో ఏదో మర్మం ఉందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. శిరీష మీద బురద చల్లేందుకే ప్రయత్నిస్తున్నారని వాపోయారు.  శిరీష మరణానికి సంబంధించి ఉన్న మా అనుమానాలు నివృత్తి చేయాల్సిన పోలీసులు ఆమె శీలహననం పైనే శ్రద్ద పెట్టటం మమ్మల్ని మరింతగా బాధిస్తుందన్నారు.  అన్నీ అనుమానాలకు  కూడా సరైన సమాధానం పోలీసులే చెప్పాల్సి ఉందన్నారు. 

sireesha husband satish chandra కోసం చిత్ర ఫలితం


ఎవరిని కాపాడాలని పోలీసుల ప్రయత్నమని అడుగుతున్నారు. అటు ఏ.సి.పి పాత్ర, ఇటు తేజస్విని పాత్ర, వీరి నేపధ్యం తదుతర తదుతర విషయాలపై లోతైన దర్యాప్తు జరిగితే కొన్ని విషయాలు తేటతెల్లమౌతాయని ఇరు భాదిత వర్గాలు భావిస్తు న్నాయి. చూస్తుంటే పోలీసులే ఒక కథ వండి వారుస్తున్నట్లుగా ఉందనే అర్ధం స్పురించేలా మాట్లాడటం గమనించాలి. మరి,  శిరీష భర్త సందేహాలకు సమాధానాలు చెప్పే వారెవరు? ఆయనకున్న అనుమానాల్ని తీర్చేవారెవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అది తీర్చటం  పోలీసుల కనీస బాధ్యత. 


మరింత సమాచారం తెలుసుకోండి: