సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల గ‌త జ‌న్మ‌ల విశేషాలు చెబుతూ సంచ‌ల‌నంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. గ‌త జ‌న్మ‌లో ఎక్క‌డ ఏ రూపంలో జ‌న్మించారు? ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చ‌నిపోయారు? అనే విష‌యాల‌ను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.  


గ‌త జ‌న్మ ఆవిష్క‌ర‌ణ 
ప్ర‌తి వారం ఒక సెల‌బ్రెటీ గ‌త జ‌న్మ తెలిపే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు. చంద్ర‌బాబు గ‌త జ‌న్మ‌ఎలా ఉండేది? గ‌త జ‌న్మ ఎక్క‌డ ఎలా సాగింది? అనే విష‌యాల‌పై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.


ఇండియాలోని సౌత్‌-వెస్ట్ మ‌ధ్య ప్రాంతంలో చంద్ర‌బాబు గ‌త జ‌న్మ జ‌రిగింద‌ని ఎస్వీనాగ్‌నాథ్ తెలిపారు. మ‌క‌రా రాశి, మ‌క‌రా ల‌గ్నంలో జ‌న్మించాడ‌ని తెలిపారు. రిచ్ ఫ్యామిలీలో బాబు జ‌న్మ జ‌రిగింది. స్త్రీల వ‌ల్ల అనేక నింద‌లు ఎదుర్కొన్నాడు. జాత‌కంలో స్వేచ్ఛ‌గా సొంతంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, ఇత‌రుల ఆలోచ‌న‌లను త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌లుచుకునే నేర్పు ఉండేది. దీంతోనే చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు.

ఆర్థిక‌ప‌ర‌మైన విష‌యాలే కాకుండా ఆంత‌రంగిక శ‌త్రువులు కూడా ఎక్కువ‌గా ఉన్నారు. సౌభాగ్య‌వ‌తి అయిన భార్య దొరికింది. పెళ్లి త‌ర్వాత జీవిత‌మే మారిపోయింది. త‌మ్ముడు, మేన‌మామ.. బాబు వ‌ల్ల (ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో) చ‌నిపోయిన‌ట్టు గ‌త‌జ‌న్మ‌లో ఉంద‌ట‌. ఆ త‌ర్వాత బాబు గ‌త‌జ‌న్మ‌లో జ‌రిగిన అనేక విష‌యాల‌ను ఎస్వీ నాగ్‌నాథ్ తెలిపారు. 


నేను ఎవ‌ర్నీ..?
న‌మ‌స్తే తెలుగు ఛాన‌ల్‌లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతోంది. ఇందులో ప్రముఖుల గ‌త జ‌న్మ ర‌హస్యాల‌ను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్ర‌సారం చేసిన చంద్రబాబు పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు.
video link:


మరింత సమాచారం తెలుసుకోండి: