bharat bhutan tibet junction కోసం చిత్ర ఫలితం


చైనా రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే కాదు సైన్య విధానాలు సైతం సాధారణంగా కుతంత్రం తోనే నిండి ఉంటాయి. అసలు వారు వేసే ప్రతి అడుగూ లోను ఏదో మరమం దాగి ఉంటుంది. ముఖ్యంగా దురాక్రమణ దాని నైజం. టిబెట్ చైనా దురాక్రమణ లో ఉండి దాని చూపు ఇప్పుడు భూటాన్ పై పడింది. సుదూర స్వపనంగా చైనా చూపు భారత్ భూ  భాగం చుట్టూ ముత్యాల సరంలాగా చుట్టేయ్యాలని దాని తపన.


భారత్ పొరుగంతా చిన్న చిన్న దేశాలే.. అన్నీ దేశాలకు ఆర్ధిక సైనిక సహాకారం అందిస్తూ వాటిని ఆక్టోపస్ లాగా చక్రబందంతో చూట్టేసే చైనా బలమైన భారత్ సరిహద్దుల్లో ఇన్-ఫ్రాస్ట్రక్చెర్ ప్రోజెక్ట్స్ చేపట్టి సైనికంగా భారత్ లాంటి బలమైన దేశంపై పెత్తనం చెలాయించి ఆసియాలో పెద్దన్న పాత్ర పొషించాలని తాపత్రయ పడుతుంది. అందులో కొంత విజయం సాధించింది కూడా.


bharat bhutan tibet junction కోసం చిత్ర ఫలితం


దాని పరిణామమే,  చైనా  తీరు వలన  సిక్కిం సరిహద్దులో ఉద్రిక్తత పెరుగుతోంది. చైనాతో వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి డోకా-లా ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపింది. అయితే ఇవి కాల్పులు జరపవని, తుపాకీ గొట్టాలను కిందికి దించి ఉంచుతాయని అధికార వర్గాలు చెప్పాయి. చైనాతో 1962నాటి యుద్ధం తర్వాత ఇరు దేశాల ఆర్మీల మధ్య నెలకుపైగా సుదీర్ఘ ఉద్రికత్త కొనసాగడం ఇదే తొలిసారి. 2013లో జమ్మూ-కశ్మీర్‌లోని లడఖ్‌ డివిజన్‌ దౌలత్‌ బేగ్‌ ఓల్దీలోకి చైనా జవాన్లు చొచ్చుకురావడంతో 21 రోజులపాటు ఉద్రిక్తత కొనసాగింది. సిక్కిం సెక్టార్‌ లోని చుంబీ లోయ పరిధిలోకి వచ్చే డోకా-లా ప్రాంతంలోని భారత బంకర్లను చైనా ఇటీవల ధ్వంసం చేయడంతో ఘర్షణ తలెత్తడం తెలిసిందే.


ఈ వివాదంపై అధికార వర్గాలు తొలిసారి పూర్తి వివరాలను అందించాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, "భారత్‌–భూటాన్‌–టిబెట్‌ కూడలిలోని డోకా-లా ప్రాంతం"  లాల్తెన్‌లో ఉన్న రెండు భారత బంకర్లను తొలగించాలని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) జూన్‌ 1న భారత ఆర్మీకి చెప్పింది. దీనిపై భారత జవాన్లు ఉత్తర బెంగాల్లోని తమ హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందించారు.


అయితే జూన్‌ 6న రాత్రిపూట రెండు చైనా బుల్డోజర్లు ఆ బంకర్లను ధ్వంసం చేశాయి. డోకా-లా తమదేనని, భారత్, భూటాన్‌ లకు దీనిపై హక్కులేదని ప్రకటించాయి. చైనా జవాన్లు, యంత్రాలు మరింత నష్టం కలిగించకుండా భారత బలగాలు అడ్డు కున్నాయి. సమీపంలోని తమ బలగాలనూ పిలిపించుకున్నాయి. దీంతో జూన్‌ 8న ఘర్షణ తలెత్తి, ఇరు పక్షాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారు.


తర్వాత జరిగిన ఫ్లాగ్‌ మీటింగ్‌లో:


* లాల్తెన్‌ నుంచి జవాన్లను వెనక్కి పంపాలని చైనా భారత్‌కు స్పష్టం చేసింది.

* భారత జవాన్లు తాము నిర్మిస్తున్న రోడ్డు పనులను అడ్డుకున్నారని ఆరోపించింది.

* మానస సరోవర్‌ యాత్రకు వెళ్తున్న తొలి బృందంలోని 47 మంది యాత్రికులను అడ్డుకుని, మరో బృందంలోని 50 మంది వీసాలను రద్దు చేసింది.

తర్వాత పీఎల్‌ఏ అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో భారత ఆర్మీ కూడా మరిన్ని బలగాలను అక్కడికి తరలించింది. చైనా జవాన్లు డోకా-లాలోకి 2008లో కూడా చొరబడి భారత ఆర్మీ బంకర్లను ధ్వంసం చేశారు. చుంబీ లోయపై ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోందని, భారత్‌–భూటాన్‌ సరిహద్దు పై గరిష్ట నిఘా కోరుకుంటోం దని రక్షణరంగ నిపుణులు చెబు తున్నారు.


bharat bhutan tibet junction కోసం చిత్ర ఫలితం

 డోకా-లా ప్రాంతంలోకి భారత జవాన్లు చొచ్చుకు వచ్చిన వివరాలని పేర్కొంటూ చైనా విదేశాంగ శాఖ ఒక మ్యాపును విడుదల చేసింది. తమ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడానికి భారత జవాన్లు చొరబడ్డారని ఆరోపించింది. ఈ మ్యాపులో డోకా-లాను చైనాలో అంతర్భాగంగా చూపారు. భారత జవాన్లు తమ భూభాగంలోకి వచ్చినప్పుడు తీసినవిగా పేర్కొంటూ చైనా గురువారం రెండు ఫొటోలను విడుదల చేసింది.


ఉద్రిక్తతకు ముగింపు పలికేందుకు భారత్‌ తమ జవాన్లను డోకా-లా నుంచి ఉపసంహరించుకోవాలని చైనా వార్తాసంస్థ జిన్-హువా పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని అడ్డుకోవద్దని చెప్పుకొచ్చింది. చైనా–పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌పై భారత్‌ "వ్యూహాత్మక ఆందోళన" ను పక్కనపెట్టి "వన్‌ బెల్ట్‌–వన్‌ రోడ్‌ ప్రాజెక్టు" లో చేరాలని  సూచించింది.

 

bharat bhutan tibet junction కోసం చిత్ర ఫలితం


భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోకా-లా ప్రాంతంలో ఇరు దేశాలు భారీగా బలగాల్ని మోహరించి ఢీ అంటే ఢీ అంటున్నాయి. డోకా-లాలోని భూటాన్‌ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణంతో గొడవ మొదలైంది. భూటాన్‌కు మద్దతుగా భారత్‌ బలగాలు రంగంలోకి దిగడం చైనాకు కోపం తెప్పించింది.


నాటి యుద్ధాన్ని గుర్తు చేసుకోవాలని భారత్‌ను చైనా హెచ్చరించగా, భారత్‌ అప్పటి దేశం కాదని రక్షణ శాఖ మంత్రి జైట్లీ దీటుగా బదులిచ్చారు. మరోవైపు సరిహద్దుల్లో చైనా యుద్ధ ట్యాంకుల్ని మోహరించడంతో, భారత ఆర్మీ చీఫ్‌ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలివి:


భారత్, చైనా, భూటాన్‌ ఉమ్మడి సరిహద్దుల్లోని కీలక భూభాగమే డోకా-లా, సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. అయితే ఇక్కడ భూటాన్‌ అధీనంలో ఉన్న ప్రాంతంలో తేలికపాటి యుద్ధ ట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా చైనా రోడ్డు నిర్మాణం కొనసాగిస్తోంది. పాత ఒప్పందాల్ని గౌరవించాలని, రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని రాయల్‌ భూటాన్‌ సైన్యం కోరినా చైనా వినిపించుకోలేదు. రోడ్డు నిర్మాణం పూర్తయితే, ఈశాన్య భారతంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని "చికెన్‌-నెక్‌  ప్రాంతం" చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావిస్తోన్న భారత్‌ వెంటనే రంగంలోకి దిగింది.


chicken neck area in bangladesh కోసం చిత్ర ఫలితం


భూటాన్‌కు మద్దతుగా తన సైన్యాన్ని ఆ ప్రాంతంలో మోహరించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది.  ప్రతీకారంగా భారత బంకర్లను పీఎల్‌ఏ ధ్వంసం చేసింది. ఇండియా- చైనా దళాలకమాండర్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతలు తగ్గలేదు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ప్రకటనల యుద్ధం కొనసాగుతోంది. తమ భూభాగంలోకి భారత్‌ బలగాలు ప్రవేశించాయంటూ చైనా నిరసన   తెలపడంతో పాటు, గత వివాదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని గత సోమవారం చైనా హెచ్చరించింది.


ఇదే సమయంలో భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ గురువారం సిక్కిం వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చైనా దూకుడు ప్రదర్శిస్తే ఎలా బదులివ్వాలన్న అంశంపై ఆర్మీ జనరల్స్‌ తో చర్చలు కొనసాగించారు.


chicken neck area in bangladesh కోసం చిత్ర ఫలితం


భారత్‌పై ఆగ్రహంతో కైలాస మానస సరోవర్‌ యాత్రకు పోయే నాథూ-లా మార్గాన్ని మూసివేస్తున్నట్టు చైనా ప్రకటించింది. హిమాలయరాజ్యమైన భూటాన్‌కు భారత్‌ అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఆ కారణంగా భూటాన్‌కు చైనాతో దౌత్య సంబంధాలు లేవు. ఆ దేశ రక్షణ బాధ్యత మొత్తం భారత్‌దే.  ఆ క్రమంలోనే చైనా దూకుడును అడ్డుకునేందుకు భారత బలగాలు రంగప్రవేశం చేశాయి. 2013, 2014లో కూడా చైనా దళాలు పశ్చిమ సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడి నప్పుడు భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: