alla ramakrishna reddy కోసం చిత్ర ఫలితం


సదావర్తి భూములపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం తాము డబ్బులు కడతామని ఆయన స్పష్టం చేశారు. తక్కువ ధరకే టీడీపీ నేతలు కోట్లాదిరూపాయల భూమిని కొట్టేయాలని కుట్రలుచేశారని, దానికి చంద్రబాబునాయుడు సహకరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధితెచ్చుకోవాలని హితవు పలికారు. పెద్ద మొత్తం విలువచేసే సదావర్తి సత్రం భూములను అతితక్కువ రేట్లకే చంద్ర బాబు నాయుడు తమ పార్టీనేతలకు కట్టబెట్టే ప్రయత్నంచేసిన విషయం తెలిసిందే.


ఈ విషయం సాక్షి మీడియా చేసిన పరిశోధనలో వెల్లడైంది. అసలు నిజాలు బయటకు తెలియడంతో చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు తాము విక్ర యిస్తున్న రూ.22కోట్ల కంటే ఐదుకోట్లు ఎక్కువ ఇచ్చినా భూములు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో చంద్రబాబు ప్రకటన ఆధారంగా హైకోర్టులో సదావర్తి భూములపై పిటిషన్‌ దాఖలైంది.


దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రూ.5కోట్లు అదనంగా చెల్లించి భూములు తీసుకుంటారా అని ప్రశ్నించగా అందుకు ఆర్కే సమ్మతం తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. దుర్గమ్మగుడి చెందినభూములు కూడా తక్కువధరలకే చంద్రబాబు తనకు తెలిసిన వాళ్లకు కేటాయిస్తున్నారని, దానిపై కూడా తాము పోరాటంచేస్తామని ఆర్కే స్పష్టం చేశారు. 


alla ramakrishna reddy కోసం చిత్ర ఫలితం

సదావర్తి భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. న్యాయస్థానం కీలక తీర్పు అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పును గౌరవించి రూ.5 కోట్లను అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు నాయుడు కొల్లగొడితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే ఆర్కే హెచ్చరించారు.


అన్యాక్రాంతం అయిన దేవాదాయ శాఖకు చెందిన మిగతా భూములపై కూడా తాము పోరాడతామన్నారు.  చెన్నైకి సమీపంలో ఉన్న 100 కోట్ల విలువ చేసే సదావర్తి భూములను చంద్రబాబు తన బినామీలకు 22 కోట్లకే కట్టబెట్టారని అన్నారు. ఈ విషయం లో తాము చేసిన న్యాయపోరాటం ఫలించిందని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం,  అదనంగా 5 కోట్ల రూపాయాలు చెల్లించి భూములను దక్కించుకుంటామన్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎమ్మెల్యే ఆర్కే ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: