నేటి కొత్త తరం రాజకీయాల్లో ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా ఛానెల్ సపోర్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక న్యూస్ ఛానెల్ ప్రసారం చేసే వార్తలపై ఆంటి పార్టీ కూడా మండిపడడం కూడా సహజమే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కి ఫుల్ సపోర్ట్ ఉన్న ఛానెల్ ఆంధ్రజ్యోతి. ఈ ఛానెల్ పచ్చ పార్టీని ఏ పనిలోనైనా వెనకేసుకు వస్తుంది. పచ్చ పార్టీ చేసే పనులను ఈ ఛానెల్ సమర్థిస్తూ వస్తుంది. అయితే ఇలా సమర్థించడం నచ్చని వైకాపా నేతలు వారి ఛానెల్ ద్వారా పచ్చ పార్టీ తీరుపై, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఛానెల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Image result for andhrajyothy

వల బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ కోవింద్ హైదరాబాద్ కు విచ్చేసిన సమయంలో వైకాపా నేత జగన్ ఆయన కాళ్లకి నమస్కరించారు. అయితే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఛానెల్ హైలెట్ చేస్తూ ప్రచారం చేసింది. ఇలా ఆంధ్రజ్యోతి తమ నాయకుడిపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతుందని వారు మండిపడుతున్నారు.  ఆంధ్రజ్యోతి పత్రికలో బుధవారం వచ్చిన కథనంపై వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు.


‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు

దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌కు జగన్‌ పాదాభివందనం చేయడం కూడా ఆ పత్రిక సహించలేకపోయిందని, అందుకే ఇంతలా విషం కక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.క్షమాపణలు చెప్పకపోతే ఆ పత్రికపై ఎస్సీ, ఎస్టీ కేసు వేస్తామని హెచ్చరించారు. గిరిజనులు మనోభావాలు దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’లో తప్పుడు వార్తలు రాశారని తెలిపారు. మీ రాతలు వెనక్కు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: