గత బుధవారం నాడు అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరుగగా, ఆ ప్రాంతంలోని స్థానికులు, పోలీసులు దాన్ని సిలిండర్ పేలుడుగా ప్రచారం చేశారని తెలుగు భక్తులు ఆరోపించారు. ఆర్మూర్‌, హైదరాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌ నుంచి 47 మంది అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. 5వ తేదీన దర్శనం చేసుకొని తిరిగి వస్తూ సాయంత్రం ఆరు గంటలకు దాబా హోటల్‌ దగ్గర ఆగారు. అక్కడ అల్పాహారం చేసుకొని తిని, బయలుదేరే ముందు బాంబు దాడి జరిగింది.



భయపడి అరకిలోమీటర్‌ బస్సుఆపకుండా ముందుకెళ్లాం. తర్వాత పోలీసులు, సైనికులు వచ్చి మమ్మల్ని ఆసుపత్రికి పంపారు. అక్కడున్న వారంతా సిలిండర్ పేలుడని చెబుతుంటే, తాము నిజం చెబితే ఏమంటారోనని నోరెత్తలేదని వాపోయారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారని, పాదాల్లోకి గుండ్లు గుచ్చుకున్నాయని అన్నారు. ఇప్పటికీ మరో ఇద్దరు అనంతనాగ్ వద్ద ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని, వారి కోసం మరో ఐదుగురు ఆగిపోయారని తెలిపారు. 


Image result for amarnath

తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించి మమ్మల్ని ప్రభుత్వ ఖర్చులతో విమానంలో ఇక్కడికి తీసుకొచ్చింది. హైదరాబాద్‌కూ ప్రభుత్వ ఖర్చులతో పంపుతోంది’’ అని బాధితులు శనివారం రాత్రి దిల్లీలో తెలంగాణ భవన్‌లో అధికారులకు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: