Image result for indo china trade

నలువైపుల నుంచి చైనా మనల్ని ఆక్టోపస్ లా కమ్ముకొని చుట్టు ముట్టేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. డ్రాగన్ దేహమంతా విషం నింపుకుని తనెక్కిన చెట్టుకొమ్మల్నే తాను నరుక్కునే క్రమంలో ఉంది. తాను తయారు చేసిన వస్తువులే మనకమ్మి దాంతోనే బ్రతికే చైనాకు ఇంత అహంభావం తగదు. అందుకే భారతీయులు తమలో ఐకమత్యం నింపుకోవాలి. విషం దేహమంతా నింపుకున్న డ్రాగన్ కు సరైన సమాధానం మనమంతా చైనా వస్తు వినియొగాన్ని ఐకమత్యంతో నిర్ద్వంధంగా తిరస్కరించటమే. 


కయ్యానికి కాలు దువ్వే చైనా కాళ్లను విరగ్గొట్టాలంటే మనమూ సై అంటే సై అనాలి కదా! అది మాత్రం యుద్ధానికి మాత్రం కాదు. అసలా అవసరమే లేదు. అంటున్నారు ముంబై పాఠశాలల్లోని ఉపాధ్యాయులు. చైనా వస్తు భహిష్కరణ మాత్రమే చాలు అంటున్నారు. చైనా వస్తు వినియోగానికి "నై అంటే నై" అని అంటే చాలంటున్నారు. 


Image result for indo china trade

"మేడ్‌ ఇన్‌ చైనా" కు నై అంటే చాలట! చైనా కాళ్లేంటి చేతులు మరియు వారి చాతలు కూడా వాటంతటవే విరిగిపోయి ఆగిపోతాయని చెబుతున్నారు.  వివరాలేమిటో చూద్ధాం: 


1962లో మనం కాస్త ఏమరుపాటుగా ఉన్న సమయంలో యుద్ధానికి దిగి, భారత్‌లోని కొన్ని కీలక ప్రాంతాలను చైనా ఆక్రమించుకుంది. నిజానికి అప్పట్లో చైనాతో యుద్ధం చేసేంత సైనిక, ఆయుధ సంపత్తి మనదగ్గర లేదు. ఎందుకంటే అప్పుడప్పుడే స్వాతంత్య్రం పొంది, స్థిరపడే దశలో ఉన్నాం మనం. మన బలహీనతను ఆసరాగా చేసుకొని "ఆక్సాయ్‌చిన్‌" ప్రాంతంతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొంతభాగాన్ని కబళించి వేసింది చైనా. అయినప్పటికీ సామ్రాజ్యకాంక్ష తీరని డ్రాగన్‌, భారత్‌ చుట్టూ "ముత్యాల సరం" పేరుతో నౌకాశ్రయాలు, యుద్ధస్థావరాలు నిర్మిస్తూ భారత్‌ సావభౌమత్వానికి తీవ్ర ముప్పును తెస్తుంది. భారత్ ను సమస్యల సుడిగుండ్డములో దిగ్బంధిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు డోక్-లామ్‌ లో రహదారి నిర్మిస్తూ, మనకు మన ఈశాన్యరాష్ట్రాలకు సంబంధాలను తెంచాలని చూస్తోందన్న విషయం ప్రపంచాం మొత్తానికి అర్ధమౌతూనే ఉంది. దీనిని సమగ్రంగా అర్ధం చేసుకుని సమర్ధవంతంగా అడ్డుకున్న భారత సైనికదళాలు, చైనాకు సరైన సమాధానం ఇస్తున్నాయి. అంగుళం కూడా చైనా  దళాలు ముందుకు రాకుండా అడ్డుకుంటున్నాయి.

Image result for indo china trade

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా చైనాను చూసి ఏమాత్రం బెదరడం లేదు. వారి సైనిక, ఆయుధ సంపత్తి మనకంటే ఎక్కువ ఉన్నా కూడా తామూ యుద్ధానికి సిద్ధమేననే సంకేతాలను పంపుతోంది. "ధైర్యంగా నిలబడడమే విజయం, భయపడడమే మరణ సదృశం" అన్న నీతిలోని రీతిని గమనించి డోక్-లామ్‌లో సైనికుల స్థిర నివాసాలను అనుమతించి చైనా సవాల్ కు జవాబే ఇస్తోంది ఇండియన్‌ ఆర్మీ. 


చైనా భారత్ ను హెచ్చరిస్తూ 1962 చైనాతో ఓటమిని ఆ చరిత్రను గుర్తుచేసుకోమని చెప్పింది దానికి నేటి భారత్ 1962 నాటి భారత్‌ కాదని, ఇప్పుడు తాము కూడా ఏదైనా ఎంతైనా చేయగల స్థాయిలో ఉన్నామని హెచ్చరికలు పంపింది. దీనికి చైనా నుంచి వస్తున్న ప్రతి సవాల్‌కూ ధీటైన జవాబిస్తూ డ్రాగన్‌ను ఎక్కడుంచాలో అక్కడే నియంత్రిస్తోంది.

Related image

మాటల యుద్ధం దాటి చేతల యుద్ధమే వస్తే ఇరు దేశాలకూ తీరని నష్టం జరుగుతుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినప్పటికీ శత్రువు కవ్విస్తుంటే తోక ముడిచి కూర్చోవడం ఓటమితో సమానమే. అందుకే భారత్‌ కూడా యుద్ధానికి సై అంటోంది. అయితే సైనికులు తమవంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. మరి మనమేం చేయాలి? ఇదిగో.. ముంబై ఉపాధ్యాయులు చెప్పింది చేస్తే చాలు.


చైనా తయారీ వస్తు సేవలను తిరస్కరిస్తే చాలు. "నో..టు ‘మేడ్‌ ఇన్‌ చైనా" అంటూ ముంబైలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయు ల అసోసియేషన్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. "మేడ్‌ ఇన్‌ చైనా" పేరుతో ఉన్న ఏ వస్తువునూ కొనకూడదని ఏ సేవనూ అనుమతించకూడదని పిల్లలకు పిలుపు నివ్వాలని నిర్ణయించింది. సమావేశం ముగిసిన వెంటనే పాఠశాలలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయులు వెంటనే తమ తమ విద్యార్థులకు తాము తీసుకున్న నిర్ణయం గురించి చెప్పారు. ఇక నుంచి చైనా వస్తువులేవీ కొనకూడదని విజ్ఞప్తి చేశారు. ఇది ఆదేశం కాదని, దేశ శ్రేయస్సు కోసం దేశప్రజలమైన మనం మన వంతు అమలు చేయాల్సిన నిర్ణయమని, అందుకే విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.


Image result for string of pearls


Here Is All You Should Know About 'String Of Pearls', China's Policy To Encircle India

చైనాలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల్లో ఆ దేశ ప్రజలు వినియోగించుకుంటున్నవి పోగా మిగిలినవాటిలో 80 శాతం వస్తువులు భారత్‌కే ఎగుమతి అవుతున్నాయి. అంతేకాక చైనా కంపెనీలు భారత్‌ లోనూ మకాం వేసి, వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా వేల కోట్ల రూపాయల మనదేశ సంపదను చైనా చేతుల్లో పెడుతున్నాం. దాదాపు అనధికార లెక్కల ప్రకారమే రోజుకు రూ.100 కోట్ల రూపాయల విలువైన చైనా వస్తువుల ను భారతీయులు కొంటున్నారట. ఒకవేళ ఇవి కొనడం మనమంతా మానేస్తే, అప్పటికప్పుడు చైనా రోజుకు రూ.100 కోట్లు నష్టపోతుంది. ఇది ప్రత్యక్షంగా కనిపించే నష్టం. పరోక్షంగా ఆ దేశంలోని ప్రజలు ఉపాధిని కోల్పోతారు. 


ఆ దేశం ఆర్థికంగా బలహీన పడుతుంది. చైనాలో తయారయ్యే వస్తువులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతాయి. చాలా దేశాల్లో చైనా వస్తువులపై నిషేధం అమల్లో ఉంది. పైగా మన దేశ మంత పెద్ద మార్కెట్‌ చైనాకు మరొకటి లేదు. మనదేశంలో అమ్మే వస్తువులతోనే చైనా మనుగడ సాగిస్తుందని చెప్పినా అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ వస్తువులే అమ్ముడుపోకపోతే, ఇంతకంటే పెద్ద యుద్ధమేదైనా ఉంటుందా? అందుకే మనమంతా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం వచ్చింది. "నో టు చైనా మేడ్ ప్రోడక్ట్స్‌"’ అని చెప్పే సమయం ఆసన్నమైంది. అలా చేస్తే చైనా మన తీరం లో రహదారుల నిర్మాణం మానయక తప్పదు. ఒక సంవత్సరం పాటు మనమిలా చేస్తే చైనా ఆర్ధికంగా దివాళాతీసే ప్రమాధం ఉంది కూడా! 


Image result for china deplomatically surrounds India

మరింత సమాచారం తెలుసుకోండి: