సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో రాణించిన, రాణిస్తున్న మహిళల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు. మొదట్లో రాజకీయాల్లో రోజా కు ప్రతి పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాబోయే కాలంలో కాబోయే మంత్రి అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియా లో రోజా జనసేన పార్టీలోకి వెళుతున్నట్లు తెగ ప్రచారం జరిగింది.



అయితే దీనిపై రోజా స్పందించారు. జనసేన పార్టీలోకి వెళ్లడానికి నాకేమైనా పిచ్చా..? అని ప్రశ్నించారు. పార్టీ మారాలంటే ఎప్పుడో మారిపోయేదాన్ని. నన్ను రాజకీయంగా తొక్కేస్తున్న వేళ, అడుగడుగునా నాకు ఓ బ్రదర్ లాగా జగన్ రక్షణ ఇచ్చారు. జీవితంలో ఆయన్ను వదిలి వెళ్లే అవసరం లేదు" అని స్పష్టత ఇచ్చారు. తనను అసెంబ్లీ కి రాణించకపోవడంలో బాబు, లోకేష్ పాత్ర కూడా ఉందని కానీ నేను సుప్రీం కోర్టులో కేసు వేసి మరీ అసెంబ్లీ లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయితే, తాను హోం మంత్రిని అవుతానని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, తానేమీ అటువంటి కమిట్ మెంట్లతో పని చేయడం లేదని అన్నారు. 


Image result for roja

జబర్దస్త్' కార్యక్రమంలో బూతు డైలాగులు, ద్వంద్వార్థాలు వచ్చే మాటలు ఉన్నాయని వస్తున్న విమర్శలపై స్పందించారు.  ఎంటర్ టెయిన్ మెంట్ షో అంటే మీకు తెలుసు. అదేమీ రియాల్టీ షో కాదు. మరి అలాంటి ఓ కామెడీ షోలో, అందరినీ వదిలేసి రోజాను టార్గెట్ చేయడమంటే, రోజాను చూసి భయపడుతున్నట్టే. నేనెక్కడా బూతు డైలాగులు చెప్పలేదు. నేనేమీ ఎడిటింగ్ చేయను. అందుకు సెన్సార్ బోర్డు ఉంది. నాపై విమర్శలు కడుపుమంటతో మాట్లాడుతున్నవే అని పరోక్షంగా బాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: