భారత్ పేరెత్తితేనే విరుచుకుపడే చైనా మీడియా స్వరం మార్చింది. ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించింది. భారత్‌లో తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను విధానం చరిత్రాత్మకం అంటూ కితాబునిచ్చింది. ఈ ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందంటూ వ్యాఖ్యానించింది.  అతి తక్కువ ఖర్చుతో కూడిన తయారీ రంగం మెల్లగా చైనా నుంచి వెళ్లిపోతుందని, త్వరలోనే ప్రపంచ మార్కెట్‌లో త‌మ దేశం స్థానాన్ని భారత్‌ భర్తీ చేయగలదని పేర్కొంది.  జీఎస్టీ కారణంగా లో—కాస్ట్ తయారీ రంగం నెమ్మదిగా ఇండియాపై మరలుతుందని, ప్రపంచ మార్కెట్లోని తమ ఆధిపత్యాన్ని త్వరలోనే భారత్ భర్తీ చేసే అవకాశం ఉందని విస్పష్టంగా పేర్కొంది.


మోదీపై చైనా మీడియా ప్రశంసల జల్లు

భారత్‌కు ప్ర‌స్తుతం మౌలిక వసతుల లేమి ఉందని, విధానాల అమలులో ఆయా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అయిన‌ప్ప‌టికీ భార‌త్ వాటిని అధిగ‌మిస్తూ ముందుకు వెళుతుంద‌ని పేర్కొంది. భారత్‌—చైనాకు సరిహద్దుగా ఉన్న సిక్కిం ప్రాంతం విషయంలో చైనా ప్రతి రోజు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కథనాలు వెలువరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా నెల రోజులుగా ఈ తంతు కొనసాగుతోంది. కానీ అనూహ్యంగా గ్లోబల్‌ టైమ్స్‌ ఈ కథనం వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 



ఒకానొక దశలో భారత్‌తో యుద్ధం తప్పదని కూడా చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. భారత్ వెనక్కి తగ్గకుంటే 1962 నాటి పరిస్థితులను ఇండియా మళ్లీ ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే భారత్ అందుకు దీటుగా జవాబిచ్చింది. ఎలాంటి పరిస్థుతులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అని మోడీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, పైగా భారత్ కు అగ్ర దేశాల సపోర్ట్ కూడా ఉండడంతో, సైనిక బలగంలో కూడా చైనా తో భారత ఏ మాత్రం తీసిపోదని గ్రహించిన చైనా మీడియా సహకారంతో మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: