ఏపీలో కృష్ణా జిల్లాలో వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉన్న పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌లో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక‌రు. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుడివాడ‌ను నాని త‌న కోట‌గా మార్చేసుకున్నారు. నాని గ‌త మూడు ఎన్నిక‌ల్లోను ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. నాని పార్టీ వేవ్ ఉన్నా లేక‌పోయినా స‌రే గుడివాడ‌లో గెలుస్తున్నారు. పార్టీలు మారినా, ఆయ‌న గెలిచిన పార్టీ స్టేట్‌లో అధికారంలోకి రాక‌పోయినా గెలుపు మాత్రం గుడివాడ నానిదే. 

Image result for ysrcp

2004 - 2009 - 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా మూడుసార్లు గెలిచిన నాని హ్యాట్రిక్ కొట్టారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ మార‌నుందా ?  నాని గుడివాడలో ఎమ్మెల్యేగా కాకుండా బంద‌రు నుంచి వైసీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేయ‌నున్నారా ? అంటే కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో అవున‌న్న ఆన్స‌రే వినిపిస్తోంది. నాని వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లా కేంద్ర‌మైన బంద‌రు నుంచి ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు జిల్లాలో పుకార్లు, షికార్లు చేస్తున్నాయి.

Image result for ysrcp ys jaga

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బంద‌రు ఎంపీ అభ్య‌ర్థిగా కొలుసు పార్థ‌సార‌థి పోటీ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న తాను గ‌తంలో పోటీ చేసిన పెన‌మ‌లూరు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే నాని గుడివాడ‌లో త‌న సోద‌రుడు కొడాలి నాగేశ్వ‌ర‌రావును ఎమ్మెల్యే బ‌రిలోకి దింపుతార‌ని టాక్‌. ఇటు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో వేరే వ్య‌క్తిని ఎంట‌ర్ కానివ్వ‌కుండా ఉంచి, తాను ఎంపీగా వెళ్లాల‌న్న‌ది నాని  ప్లాన్‌గా తెలుస్తోంది.


నాగేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో అన్న నాని త‌ర‌పున వ్య‌వ‌హారాల‌న్ని ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. రాజ‌కీయంగా నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే నాని ఎంపీగా పోటీ చేస్తే గుడివాడ అసెంబ్లీ సీటు నాగేశ్వ‌ర‌రావుకే ద‌క్కడం ఖాయంగా క‌నిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: