నంద్యాల ఉప ఎన్నికలో గెలవడం కంటే ప్రస్తుతం చంద్రబాబు కీ ఆయన మంత్రులకీ గొప్ప టార్గెట్ ఏదీ లేదు. ఆ ఉప ఎన్నికలో గెలిచి అధికార పార్టీ ఎంత బలంగా ఉంది అనేది చూపించుకోవడమే వారి ఆసక్తి. వ్యూహాత్మకంగా ఒక పక్క సాగుతూనే మరొక పక్క పార్టీ బాధ్యతలు నలుగురు మంత్రుల మీద అప్పజెప్పారు చంద్రబాబు.


సీనియర్ నేతలు ప్రచారం లోకి కూడా దిగుతున్న ఈ టైం లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాల మీద కావాల్సినంత డబ్బు , టైం పెడుతున్నారు లోకల్ అధికారులు. గ‌డ‌చిన మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి ప‌నులు చ‌క‌చ‌కా అయిపోతున్నాయి! అంతేకాదు, కొత్త కొత్త వ‌రాల‌ను కూడా నంద్యాల‌పై కురిపిస్తున్నారు.


ఈ నేప‌థ్యంలో క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు మంత్రి లోకేష్‌. ఆయ‌న‌తోపాటు సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మంత్రి అఖిల ప్రియలు క‌లిసి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు.


అన్నా క్యాంటీన్ లని నంద్యాల లోనే ఏర్పాటు చెయ్యబోతున్నారు, ఈ విషయ ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ క్యాంటీన్ లు అక్కడ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పటి వరకూ అమ్మా క్యాంటీన్ లని అన్నా క్యాంటీన్ లు గా తమిళనాడు నుంచి వచ్చిన ఐడియా ని అమలు చేస్తాం అన్నారు కానీ ఎక్కడా చెయ్యలేదు. ఈ ఉప ఎన్నిక పుణ్యమా అని వారం లో అన్నా క్యాంటీన్ లు రాబోతున్నాయి, అంతేనా  ఏకంగా నూట పద్నాలుగు కోట్లు రోడ్ల కోసం మంజూరు అయ్యాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: