చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ బాబు మాటాల్లో ఏముందో కానీ ప్ర‌తిసారి అవ‌మాన పాలే అవుతూ వ‌స్తు న్నారు. గ‌తంలో చాలా సార్లు నోటి త‌డ‌బాటుతో చెప్పిన మాట‌ల‌ను వెన‌క్కు తీసుకోవాల్సి వ‌చ్చింది. ఇలాంటి గ‌తంలో చాలానే జ‌రిగాయి. అయితే తాజా మ‌రోసారి లోకేష్ త‌న మాట‌ల‌తో ఘోరంగా అవ‌మాన ప‌డాల్సి వ‌చ్చింది. వాస్త‌వానికి రాష్ట్రంలోత‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాన‌ని ప్ర‌జ‌లు ఏదో సంద‌ర్భంలో ప్ర‌జా ప్ర‌తినిధ‌లు, మంత్రుల ను నిల‌దీస్తూనే ఉంటారు. 


ఎన్నికల సమయంలో ద‌య  మెనిఫెస్టోలో పొందు ప‌రిచిన ప‌థ‌కాలు నేటికీ అమలు చేయని ప్ర‌భుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులను సైతం ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కర్నూలులో ఓ సభకు హాజరైన సందర్భంగా మంత్రి లోకేష్‌కు స్థానికులు సూటి ప్రశ్న సంధించడంతో నీళ్లు నమలడమే మంత్రి వంతయింది.
రాయలసీమకు భారీగా పరిశ్రమలొచ్చాయని తమ ప్రభుత్వ పనితీరు కారణంగానే పెట్టుబడులొస్తున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

కియ మోటార్స్‌ కంపెనీ రావడంతో 5 లక్షల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చా యని మంత్రి చెప్పడంతో అక్కడి ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. అయితే 5 లక్షల ఉద్యోగాలు వచ్చిన వారిలో ఒక్కరిని చూపిస్తే చాలంటూ స్థానికులు మంత్రి లోకేష్‌ను నిలదీశారు. ఇలాంటి మాటాలు  ఎందుకు మాట్లాడుతావంటూ ప్ర‌జ‌లు చీ కొట్టారు. 
వెంటనే స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు లోకేష్‌ను ప్రశ్నించిన వారిని అడ్డుకుని వారించే యత్నాలు మొదలుపెట్టారు. దీంతో స్థానికుల ఆగ్రహం రెట్టింపయింది. మీ నాయకుడి ముందు మీరు ఎలాగూ మాట్లాడలేరు.. కనీసం మమ్మల్ని అయినా మాట్లాడనివ్వాలంటూ టీడీపీ నేతలపై కర్నూలు వాసులు మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: