అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారులకు కొంత మంది మధ్య సఖ్యత కుదిరితే మరి కొంత మంది మధ్య కుదరదు. దీనికి వ్యక్తి ప్రవర్తన, అలవాట్లు, ఆలోచనా విధానాలు ఇలా చాలా తోడు అవుతాయి. అయితే వీటిలో లోపాల వల్ల అధికారులకు, నాయకులకు మధ్య మనస్పర్థలు వస్తూ ఉంటాయి. ఇలాంటి మనస్పర్థలు మీడియా ముందు బయటపడితే మీడియా కు ఇక పండగే. వీరిద్దరి కామెంట్లను ఒకరోజంతా ప్రచారం చేసి రచ్చ రచ్చ చేస్తారు. వీరి మనస్పర్థలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసేలా చేస్తారు.



సరిగ్గా ఇలాంటి సంఘటనే టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఎదురైంది. మొదట టీడీపీ పార్టీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆందోల్ ఎమ్మెల్యే గా గెలిచిన బాబు మోహన్, మాజీ చిత్ర పరిశ్రమ కమీడియన్ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ పై విరుచుకుపడ్డారు.  రేగోడ్ మండలం కొండాపురం, జగిర్యాల, రేగోడ్ లలో నిన్న జరిగిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటడానికి ఆయన వచ్చారు.


Image result for babu mohan

అయితే, అంతకు ముందు మంజూరు చేసిన సీసీ రోడ్డు ఆయనకు కనిపించలేదు. దీంతో, ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఏఈ చంద్రశేఖర్ పై విరుచుకుపడ్డారు. 'అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తే... నీ ఇష్టం వచ్చిన చోట పనులు చేయిస్తావా?' అంటూ ఆయన నిప్పులు చెరిగారు. 'ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావ్? నీ ఉద్యోగం ఊడదీయించేస్తా' అంటూ హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: