ఒక వింత తీర్పు న్యాయస్థానం న్యాయన్నే జనం ప్రశ్నించేలా చేస్తోంది. 2008 లో బీఎండబల్యూ కార్ ని నడుపుతూ ఒక ద్విచక్ర వాహనదారుడి మృతి కి కారణమైన హరియానా కి చెందిన ఒక వ్యాపారవేత్త కుమారుడికి కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష వేసింది . జడ్జి ఇచ్చిన తీర్పు లో షాకింగ్ లోపాలు కనిపిస్తున్నాయి.


గోవును చంపిన నేరానికి వివిధ రాష్ట్రాల్లో కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్న వారికి మాత్రం నామమాత్రపు శిక్షలు విధించి వదిలేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఉత్సవ్ భాసిన్ ని దోషిగా నిర్ధారించి రెండేళ్ళు జైలు తో పాటు మృతుడి కుటుంబానికి పది లక్షలు డబ్బు, రెండు లక్షలేమో క్షత గాత్రుడికి ఇవ్వాలి అని కోర్టు చెప్పింది.  


ఈ కేసులో మేలోనే కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్షాకాలాన్ని మాత్రం శనివారం ప్రకటించింది. అంతేకాదు, దోషికి కొన్ని షరతులతో బెయిలు కూడా మంజూరు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: