ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు పొలిటిక‌ల్ స్టైలే వేరు. ఊస‌ర‌వెల్లి రంగులు మార్చినంత సులువుగా ఆయ‌న రాజ‌కీయాల్లో పార్టీలు మార్చేస్తుంటారు. ఆయ‌న గ‌త నాలుగు ఎన్నిక‌లుగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మారారు.. మూడు పార్టీలు మారారు. రెండు ద‌శాబ్దాలుగా విశాఖ జిల్లా రాజ‌కీయాల్లో ఓ కింగ్‌గా చ‌క్రం తిప్పుతోన్న గంటా ఇప్పుడు ఆ జిల్లా రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నార‌న్న వార్త పెద్ద సంచ‌ల‌నంగా మారింది. 

Image result for tdp

1999లో టీడీపీ నుంచి అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచిన గంటా ఆ త‌ర్వాత 2004లో చోడ‌వ‌రం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జారాజ్యం పార్టీలోకి జంప్ చేసిన గంటా అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో ఆ పార్టీ నుంచి ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి మ‌రోసారి నియోజ‌క‌వర్గం మారి భీమిలి నుంచి గెలిచి మ‌ళ్లీ బాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు.

Image result for prajarajyam

ఇక ప‌లుసార్లు పార్టీలు మార‌డం, నియోజ‌క‌వ‌ర్గాలు మార‌డంతో విశాఖ జిల్లా ప్ర‌జ‌ల్లో గంటాపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి తోడు భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో భూకుంభ‌కోణం వెలుగు చూడ‌డంతో ఇదంతా గంటా మెడ‌కు చుట్టుకుంది. విప‌క్షాల నుంచి, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి గంటాపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గంటా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి నియోజ‌క‌వ‌ర్గం మారేందుకు రెడీ అవుతోన్న‌ట్టు విశాఖ జిల్లాలో చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.


ట్విస్ట్ ఏంటంటే ఈ సారి గంటా నియోజ‌క‌వ‌ర్గం మార‌డ‌మే కాదు ఏకంగా జిల్లానే మారిపోతున్న‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే విశాఖ జిల్లాలోనే మ‌రో సేఫ్ నియోజ‌క‌వ‌ర్గం చూసుకునే గంటా, పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌ని ప‌క్షంలో ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌.గంటా ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నారు. 


ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో ఆయ‌న ఏకంగా కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు నిర్ణ‌యాలకు యాంటీగా వెళుతూ అక్క‌డ చాప‌కింద నీరులా దూసుకుపోతున్నాడు. విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడి ఎంపిక‌లో అశోక్ మాట‌కంటే గంటా చెప్పిన వాళ్ల‌నే బాబు ఎంపిక చేశారు. ఇక నెల్లిమ‌ర్ల నుంచి ప్ర‌స్తుతం సీనియ‌ర్ ఎమ్మెల్యే ప‌తివాడ నారాయ‌ణ‌స్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వ‌యోః భారంతో పోటీ చేయ‌ర‌ని...ఈ క్ర‌మంలోనే గంటా క‌న్ను నెల్లిమ‌ర్ల‌పై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి గంటా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎంట్రీ ఇచ్చేందుకు బాబు సుముఖ‌త వ్య‌క్తం చేస్తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: