యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రాష్ర్టపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా ముగిశాయి. అటు పార్లమెంట్ లో ఇటు తెలగు రాష్ట్రాల శాసనసభలోనూ  ఎన్నికల ప్రక్రియను పోలింగ్ అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ,తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత మురళీమనోహర్‌ జోషి తదితరులు ఓటేశారు.  

శాసనసభలో ముఖ్యమంత్రులు  కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు,  మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇక పార్లమెంట్ లో మోదీ తొలి ఓటు వేశారు.   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పార్లమెంట్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఎం చంద్రబాబు, తెలంగాణ శాసన సభలో కేసీఆర్ లు తొలి ఓటు వేశారు. అలాగే ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఓటు వేశారు.   ఆ తర్వాత శాసనసభ స్పీకర్ లు తమ ఓటు వినియోగించుకున్నారు.  ఏపీలో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాయపాటి సాంబశివరావు ఓటు వేశారు.  

తెలంగాణలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే టిఆర్ఎస్‌కు చెందిన మనోహర్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ అనారోగ్యం కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికలు ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా జరిగేవి..కానీ ఈ సారి అధికార ప‌క్షాన‌ రామ్‌నాథ్ కోవింద్, విపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ  పోటీ చేయడంతో  గెలుపు ఎవరిదీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేల సెల్‌ఫోన్‌లు, పెన్నులను అధికారులు పోలింగ్ బుత్‌లోకి అనుమతించడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: