Image result for china india global times


చైనా ప్రభుత్వం కంటే చైనా మీడియాకు భారత్ అంటే కంటగింపుగా మారింది, అసూయతో కుతకుత లాడిపోతుంది. తమ ప్రభుత్వాన్ని భారత్ పై అనుక్షణం రెచ్చగొడుతూంది. అయితే తాజాగా  భారత్‌లో ప్రవహిస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రవాహం అక్కడి తయారీ రంగ సామర్థ్యం వృద్ధి చెందడంలో పరిణామాత్మకంగా అతి కీలకంగా నిలిచిందని బీజింగ్‌ మీడియా తెలిపింది. 


ఈ వినూత్న ఆధునిక యుగంలో చైనా అభివృద్ది నిర్లిప్తంగా, నిస్తేజంగా, నిశ్శబ్దంగా మారరిందని, ఇప్పటికైనా భారత్‌ ఎదుగు దలను అభివృద్దిని చూసి మరింత ప్రభావవంతమైన, పరిణామాత్మక, వ్యూహలను పన్నాలని తమ ప్రభుత్వానికి సలహాలతో కూడిన ఒక కథనం ఆ దేశపు ప్రధాన మీడియ ఐన "గ్లోబల్‌ టైమ్స్‌" రాసింది.


Image result for china india global times



విదేశీ పెట్టుబడులరాకతో భారత తన బలహీనతలకు పరిష్కారం దొరికించుకుందని తెలిపింది. మేకిన్ ఇండియా ద్వారా తయారీ రంగ సామర్థ్యం ఇతోదికంగా పెరిగిందని అందులో చైనా పెట్టుబడుల పాత్ర కూడా ఉందని నొక్కి చెప్పింది. మళ్లీ మళ్లీ పెట్టుబడులు రావడమే భారత్‌ను విజయవంతం చేస్తోందని అభివృద్ది మార్గం లో నడిపిస్తుందని వెల్లడించింది. 


"గతంలో భారత్‌కు పెట్టుబడి, అభివృద్ధి చెందిన తయారీ రంగం, నైపుణ్యమున్న మానవ వనరులు లేవు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఈ సమస్యలను తీర్చింది. భారత్‌లో తయారీకి మద్దతుగా నిలిచింది" అని గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది. చైనాలో రెండు దశాబ్దాల కిందట ఏం జరిగిందో అదే భారత్‌లో ఇప్పుడు జరుగుతోందని వెల్లడించింది. సంస్థలు, నైపుణ్యమున్న మేనేజర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో తయారయ్యారని ప్రశంసతో చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: