భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.  ఎన్నో దశాబ్దాలుగా తల్లిగా భావిస్తూ వచ్చిన బిజెపి, ఇక తన పార్టీ కాదన్నారు.  బిజెపిని వదిలినందుకు బాధగా ఉన్నప్పటికీ, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఎత్తుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

ఏడాదిన్నర వయసులో తల్లిని కోల్పోయా.. పార్టీనే తల్లిగా భావిస్తూ జీవితం గడిపానని ఆయన తెలిపారు. "బీజేపీ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా.. పార్టీని వీడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యారు.  తాను ఓ సాదారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని..తనకు ఎలాంటి చెప్పుకోదగ్గ బ్యాగ్ గ్రౌండ్ లేదని అన్నారు.  

నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని తనను ఇంతవాడిని చేసింది పార్టీయే అన్నారు.  ఎంతో బాధ్యాతయుతమైన మరో పాత్రలోకి నేను వెళ్తున్నానని.. ఇష్టపూర్వకంగానే బాధ్యతలు స్వీకరిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగ నియమ, నిబంధనలు, ఆదర్శాలకు లోబడి పని చేస్తానని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రచారం చేసే ప్రసక్తేలేదు.. తనకు మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Image result for venkaiah naidu nomination


మరింత సమాచారం తెలుసుకోండి: