తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలు ఊసలు లెక్కపెట్టాల్సి వచ్చింది.  జయలలిత మరణం తర్వాత తమిళనాడు సీఎం పదవి కోసం శశికళ ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేసింది.  అయితే మొదటి నుంచి ఆమెకు అడ్డుగా వస్తున్న పన్నీరు సెల్వంపై విజయం సాధించడానికి ఎమ్మెల్యేలను ఫామ్ హౌజ్ కి తీసుకు వెళ్లి మరీ బేరసారాలు ఆడినట్లు ఆప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.  
Image result for shashikala jayalalitha
అంతే కాదు సీఎం గా ఉన్న జయలలితపై కుట్ర పన్ని ఆమె మృతికి కారణం శశికళ అయ్యిందని అప్పట్లో వార్తలు సంచలనం రేపాయి.  మొత్తానికి అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు.  అయితే జైల్లో ఉండి కూడా తన ప్రతాపాన్ని చూపించాలని చూసిన శశికళకు ఆమె ప్రధాన అనుచరుడు ప్రస్తుతం తమిళనాడు సీఎం పళని స్వామి నుంచి వ్యతిరేకత వచ్చిందని మీడియాలో వార్తలు కోడైకూశాయి.  ఏది ఏమైనా  రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా..సంపన్నులు తల్చుకుంటే జైల్లో సౌకర్యాలకు కొదవా..ఈ విషయం ఇప్పటి వరకు ఎంతో మంది నేరస్థుల విషయంలో రుజువైంది.
ఎలా ఉన్నారు ?
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ విషయంలో ఇదే తంతు కొనసాగుతుంది..బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని వెలుగు చూసింది. ఆమె శిక్ష అనుభవిస్తున్న జైలు గదుల ఫోటోలు లీక్ అయ్యాయి.  ఇప్పటికే శశికళకు మొత్తం ఐదు లాకప్ లు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఐదు లాకప్ లకు కర్టన్లు వేశారు. హాల్ లో శశికళ కోసం వంట చెయ్యడానికి అవసరం అయిన ఆహారపదార్థాలు పెట్టిన విషయం ఈ ఫోటోలలో స్పష్టంగా కనపడుతోంది.
ఫస్ట్ టైం శశికళ చుడిధార్ లో
అయితే ఈ సౌకర్యాలన్నీ  శశికళ సోదరుడు జయరామ్, ఇళవరసి కుమారుడు వివేక్ ఈ తతంగం మొత్తం నడిపించాడని మంగళవారం తమిళ మీడియా వార్తలు ప్రసారం చేసింది.  జైల్లో శశికళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మీకు ఏమీ కావాలన్నా ఇస్తానని వివేక్ అధికారులను బుట్టలో వేసుకున్నాడని సమాచారం. ఇలా అధికారులను అనేక రకాలుగా మభ్యపెట్టిన వివేక్ చివరికి తన మేనత్త శశికళకు అన్ని సౌకర్యాలు కల్పించాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: