దేశానికి వెన్నముక పార్లమెంటు అయితే ఆ పార్లమెంటు కి ప్రాణవాయువు ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ భారత ఎంపీలు అందరికీ తెలియ జేశారు. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు ఆయన. పార్లమెంటు సభ్యుల యొక్క హుందా ప్రవర్తన , వ్యక్తిగత క్రమశిక్షణ అనేవి ప్రజలలో తీవ్రంగా ప్రతిబింబిస్తాయి అనీ వాళ్ళ యొక్క ప్రవర్తన , నడవడిక దేశం యావత్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది అన్నారు అన్సారీ. తాజాగా జరిగిన లోక్మత్ పార్లమెంటరీ అవార్డుల కార్యక్రమం లో పాల్గొన్న అన్సారీ అనేకమందిని సత్కరించారు.


భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీ, జేడీ(యు) సీనియర్‌ నాయకుడు శరద్‌ యాదవ్‌లను జీవన సాఫల్య పురస్కారాలతో ఆయన ఘనంగా సత్కరించారు. లోక్ సభ లో మహిళా సభ్యురాలు మీనాక్షీ లేఖి తో పాటు సుస్మితా దేవ్ లని ఉత్తమ కొత్త పార్లమెంట సభ్యులు గా సత్కరించారు ఆయన. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌(ఆర్‌ఎస్‌పీ) నిలిచారు. రాజ్యసభ నుంచి సీతారాం ఏచూరి (సీపీఎం) ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ భార్య, ప్రముఖ ఎంపీ ఉత్తమ మహిళా పార్లమెంటేరియన్ గా అవార్డు గెలుచుకున్నారు .


ఎన్డీయే తరఫున నామినేట్ అయిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పార్లమెంటు వెలుపల ఎలా ఉన్నా లోపలకి వచ్చిన తరవాత మాత్రం ఎవ్వరూ ఒకరిని ఒకరు శత్రువు లాగా చూడకూడదు అని కోరారు. " రాజకీయంగా మీరు ప్రత్యర్ధులు అయితే కావచ్చు అది బయట వ్యవహారం. పార్లమెంటు లో అడుగు పెట్టిన తరవాత మీ మీద బోలెడంత బాధ్యత ఉంది అనేది గుర్తు పెట్టుకోవాలి. దేశం యావత్తూ మిమ్మల్ని గమనిస్తోంది అనేది మీరు గ్రహించాల్సిన టైం అది.


మీరిక ఏ మాత్రం శత్రువులు కానే కాదు. అలా భావించడం భావి తరాలకి మంచిది కాదు " అన్ని గుర్తు చేసారు వెంకయ్య. లేటెస్ట్ టెక్నాలజీ పుణ్యమా అని ప్రతీ ఒక్క మెంబర్ తీరు నీ ప్రజలు దగ్గరనుంచే గమనిస్తున్నారు అనీ అందుకే తాము మరింత జాగ్రత్తగా ఉండాలి అని వెంకయ్య కోరారు 

మరింత సమాచారం తెలుసుకోండి: