నంద్యాల ఉప ఎన్నిక ని అధికార విపక్షాలు తేలికగా తీసుకోవడం లేదు. అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలుగా చంద్రబాబు దీన్ని కన్సిడర్ చేస్తున్నారు అని అక్కడ యాక్టివ్ గా ఉన్న ఎమ్మెల్యే లూ మంత్రులనీ చూస్తుంటే నే తెలుస్తోంది. మూడేళ్ళుగా తమ ప్రభుత్వం చేస్తున్న పాలన జనాలకి నచ్చి నంద్యాల లో సూపర్ మెజారిటీ ఇచ్చారు అని అనిపించుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందర ఉన్న ప్రాధమిక, ప్రధాన లక్ష్యం కాగా టీడీపీ పాలన అంతా తుస్ అని నిరూపిస్తూ ఇక్కడ గెలవాలి అనేది వైకాపా ఎత్తుగడ.


ఇద్దరిలో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ ధన ప్రవాహం మాత్రం ఈ ప్రాంతం లో ఏరులై పారుతోంది అని చెప్పచ్చు. అధికార పక్షానికి తగ్గట్టుగా ప్రతిపక్షం కూడా ఇక్కడ ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతోంది అని లోకల్ జనాలే చెబుతున్నారు. అభివృద్ధి పనుల పేరిట టీడీపీ ఇప్పటికే బోలెడంత నిధులు ఇక్కడ గుమ్మరించింది. ఐదొందల కోట్ల తో ఎన్నడూ లేని నియోజికవర్గాల అభివృద్ధి గడిచిన అతి తక్కువ వారాల కాలం లో పూర్తి చేసింది ప్రభుత్వం. ఇక అనధికార లెక్కల ప్రకారం చూసుకుంటే అధికార పార్టీ 40 కోట్లు వరకూ ఈ ప్రాంతం లో పెడుతోంది అని టాక్.


గ్రామ స్థాయి నుంచీ టీడీపీ కి టీడీపీ వైకాపా కి వైకాపా ఎంత ఖర్చు పెడితే సీటు గెలవచ్చు అని సెపరేటు సర్వేలు చేయించుకుని మరీ ఓటరుకి ఇంత అని లెక్కేసి ఖర్చు పెడుతున్నట్టు నంద్యాల లోకల్ గా టాక్ వినిపిస్తోంది. వైకాపా పెట్టుకున్న బ‌డ్జెట్ రూ. 30 కోట్లు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఈ సొమ్ము పంపిణీ విష‌యంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నీ, ఇప్ప‌టికే ప‌లువురు నాయ‌కులపై డేగ‌క‌న్నేసి ఉంచార‌నీ ఆ పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది !

మరింత సమాచారం తెలుసుకోండి: