డ్ర‌గ్ రాకెట్ తెలంగాణతో పాటు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోలు, డైరెక్ట‌ర్లు, ఆర్టిసులు ఇలా అంతా ఇందులో ఎందరో! అయితే ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు దిగ్విజ‌య్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు! తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌కు ఈ డ్ర‌గ్స్ రాకెట్ సంబంధాలు ఉన్నాయంటూ.. ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌కంప‌న‌లు సృష్టించారు. ఇప్ప‌టికే సినీ ప్ర‌ముఖుల‌ను ఈ డ్ర‌గ్స్ ముఠా గుట్టు ర‌ట్టు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్.. ప్ర‌శ్నిస్తున్న స‌మ‌యంలో డిగ్గీ రాజా వ్యాఖ్య‌లు తెలంగాణ రాజకీయాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దీంతో వార్ ఆఫ్ వ‌ర్డ్స్ పేలుతున్నాయి! 

Image result for Drug Racket in telugu states

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్ర‌గ్స్ రాకెట్‌.. రాజ‌కీయ రంగు పులుముకుంది. నిన్నటి వ‌ర‌కూ ఈ వ్యవహారంపై రాజకీయ నేతలు పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేనేలేవు. సజావుగా జ‌రుగుతున్న డ్రగ్స్ వ్యవహారంలో ఎట్టకేలకు రాజకీయ ప్రకంపనలు చెల‌రేగాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత - మధ్య ప్రదేశ్ కు సీఎంగా వ్యవహరించిన కీలక రాజకీయవేత్త దిగ్విజయ్ సింగ్ తొలిసారి ఈ వ్యవహారంపై నోరు విప్పారు. డ్రగ్స్ వ్యవహారంపై ట్విట్టర్ లో స్పందించిన ఆయ‌న... ఏకంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు, తెలంగాణ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారకరామారావును టార్గెట్ చేశారు. 


కేటీఆర్ ను టీఆర్ ఎస్ వారుసుడిగా పేర్కొంటూ.. ఆయన స్నేహితులకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నాయంటూ డిగ్గీరాజా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. `తెలంగాణలో పెద్ద డ్రగ్స్ స్కామ్ జరిగింది. ఇందులో టీఆర్ ఎస్ వారసుడి మిత్రులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. వీరిని విచారిస్తారో కాపాడతారో చూడాలి` అంటూ ఆయన ట్వీట్ తో డ్రగ్స్ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమేశారు. దీనికి కేటీఆర్ కూడా దిమ్మతిరిగే సమాధానం తో రీ ట్వీట్ చేశారు. `మీరు పూర్తిగా విచక్షణ కోల్పోయారు. గౌరవంగా రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. మీ వయసుకు తగ్గట్టుగా నడుచుకోండి. తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయడం నేర్చుకున్నందుకు సంతోషమ`ని కౌంట‌ర్ ఇచ్చారు.
ఉదయం 8.42 గంటలకు డిగ్గీరాజా ట్విట్టర్ లో ఎంట్రీ ఇవ్వగా ఓ గంటలోనే స్పందించిన కేటీఆర్ సరిగ్గా 10 గంటలకు తన రెస్పాన్స్ ను అదే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. డిగ్గీరాజా ట్వీట్ - కేటీఆర్ రీట్వీట్ తో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా వచ్చేసిందన్న వాదన వినిపిస్తోంది. మ‌రి దీనిపై ఇంకెన్ని వార్త‌లు గుప్పుమంటాయో వేచిచూడాల్సిందే!! 



మరింత సమాచారం తెలుసుకోండి: