రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమే అయినా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ ఓటమి ఖాయమని తెలిసినా బరిలో నిలిచారు. ఓడిపోతానని తెలిస్తే పోటీ చేయకూడదా.. అని నామినేషన్ సమయంలోనే ఆమె వ్యాఖ్యానించిందంటే.. ఆమె పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


మొత్తం 4 టేబుళ్లపై 8 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటివరకూ అందుతున్న ఫలితాలను చూస్తే.. రామ్ నాథ్ కోవింద్.. మీరా కుమార్ పై దాదాపు 2 లక్షలో ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీన్ని బట్టి ఆయన ఎన్నిక లాంఛనమే.


అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ కు ఒక్క ఓటు కూడా నమోదు కాకపోవడం విశేషం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా యూపీఏకి ఈ పరిస్థితి లేదు. ఏపీలో కోవింద్ కు 27,189 ఓట్లు నమోదయ్యాయి. మీరా కుమార్ కు ఒక్కటి కూడా రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం ఓట్లూ కోవింద్ కు పడ్డాయి.


పార్లమెంటులో కోవింద్ కు 3,69,576 ఓట్లు రాగా, మీరాకు 1,59,300 ఓట్లు వచ్చాయి. గుజరాత్, గోవాలలో క్రాస్ ఓటింగ్ నమోదైంది. ఈ రెండు రాష్ట్రాల్లో యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ కు పడాల్సిన ఓట్లు కూడా కోవింద్ కు పడడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: