చంద్రబాబు - కెసిఆర్ ఇద్దరూ రాజకీయంగా మిత్రులు ఏమీ కాదు .. కానీ చంద్రబాబు కి సంబంధించి ఒక నిర్ణయం కెసిఆర్ తీసుకుంటే ఆ ఒక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు పండగ చేసుకుంటారు అని చెప్పచ్చు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా రూపొందుతున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించే ఈ హడావిడి అంతా.


ఈ ప్రాజెక్ట్ విషయం లో పోలవరానికి సంబంధించి పర్యావరణ మదింపులు అన్ని స్థాయిలలో జరిగిన తరవాత మాత్రమె పోలవరం పనులు ముందుకు జరగాలి అని తెలంగాణా సర్కారు సుప్రీం కోర్టు ని కోరుకుంది. ఇదివరకు ముప్పై క్యూసెక్కుల నీరు తగినట్టు గా దీన్ని డిజైన్ చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు యాభై క్యూసెక్కుల నీరుకి తగినట్టుగా మార్చడం తో బ్యాక్ వాటర్స్ వారికి చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది అనీ దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకోవాలి అని తెలంగాణా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.


పోలవరం నీటి సామర్ధ్యం పెంచడం మంచి విషయమే అయినా దాని వలన ఖమ్మం జిల్లాలోని 9 మండలాల పరిధిలో 100 గ్రామాల వరకు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నదని తెలంగాణ వాదిస్తోంది. ఈ కేసుల వలన పనులు ఆగే పరిస్థితి గనక ఎదురైతే అది చంద్రబాబు కే పాజిటివ్ అంటూ మాటలు వినపడుతున్నాయి. ఎందుకంటే పోలవరం పనులు ఇప్పటికే యమా స్లో గా నడుస్తున్న నేపధ్యం లో ప్రతీవారం చంద్రబాబు ఎంత కష్టపడి అధికారులకి క్లాసులు పీకుతున్నా, దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నా కూడా పని ముందుకు కదలడం లేదు.


పోలవరం ఖర్చు తమదే అని చెప్పిన కేంద్రం ఇప్పటిదాకా మూడేళ్లలో నికరంగా ఇచ్చింది చాలా తక్కువ. నిధుల విడుదల వ్యవహారాలు ఒక పట్టాన తేలడం లేదు. సో అనుకున్నంత వేగంగా పోలవరం జరగడం లేదు అనేది వాస్తవం అని టీడీపీ లో వినపడుతున్న మాటే. అలాంటి టైం లో కెసిఆర్ సర్కారు దెబ్బకి సుప్రీం గనక పోలవరం మీద స్టే ఇస్తే చంద్రబాబు సర్కారు కి చాలా టైం దొరుకుతుంది అని చెప్పచ్చు 

మరింత సమాచారం తెలుసుకోండి: