ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్ కేసు గురించి ఒకటే చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకుల మధ్యనా, సినిమా జనాల మధ్యనా మాత్రమె కాకుండా సామాన్య జనం కూడా చాలా ఆసక్తిగా ఈ డ్రగ్స్ వాడకం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ కేసు మీద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్ ఆసక్తికరంగా వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన లో ఉన్న చంద్రబాబు అనేక పనులలో బిజీ గా ఉన్నారు.


ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడిన చంద్రబాబు తన సొంత ప్రాంతం ప్రజలు తనమీద చూపించే ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. . అందుకే, అభివృద్ధి కార్య‌క్ర‌మం ఏదైనా ఇక్క‌డి నుంచే ప్రారంభిస్తాన‌ని చెప్పారు. " పిల్లలకి ఆస్తులు కాదు సరైన చదువు, గుణ గణాలు అందించడం పెద్దవాళ్ళు గా మన సాంప్రదాయం. అది అర్ధం చేసుకుని అందరూ మసలుకోవాలి.ఆస్తులు ఎక్కువ అయితే దుర‌ల‌వాట్లే వ‌స్తాయ‌నీ, అందుకు నిద‌ర్శ‌న‌మే డ్ర‌గ్స్ తీసుకోవడం, అర్ధరాత్రుల వరకూ రోడ్ల మీద తిరగడం " అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు.


బెల్టు షాపుల్ని పూర్తిగా తక్కువ టైం లో నిర్వీర్యం చేసిన ఘనత తమదే అన్నారు చంద్రబాబు. మొన్నటికి మొన్న మాట్లాడుతూ హైదరాబాద్ డ్రగ్స్ తలనోప్పిలో ఇరుక్కుంది అన్న బాబు ఇవాళ డబ్బున్నవాళ్ళు అంతా డ్రగ్స్ కి బానిసలు అవుతారు అంటూ జనరలైజ్ చెయ్యడం కాస్తంత విమర్సలకి తావిచ్చేలా కనిపిస్తోంది. డ‌బ్బున్న‌వాళ్లంతా దుర‌ల‌వాట్ల‌కు బానిస‌లు కారు క‌దా! దుర‌ల‌వాట్ల‌కు దారి తీసే కార‌ణాల్లో డ‌బ్బు ఎక్కువ ఉండ‌టం అనేది ఒక‌టి కావొచ్చు. చంద్ర‌బాబు చెప్పాల‌నుకున్న ఉద్దేశం కూడా ఇదే అయి ఉండొచ్చు. కానీ, ఇంకాస్త క్లారిటీగా మాట్లాడి ఉంటే బాగుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: