తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చడానికి నానా తంటాలు పడుతున్నారు ఇక్కడ ప్రభుత్వం.  మరోవైపు అదే రేంజ్ లో నేర సామ్రాజ్యం కూడా విస్తురిస్తుంది.  గతంలో మాఫియా లీడర్స్ అనగానే ముంబాయి, ఢిల్లీ, కల్ కత అని అనుకునేవారు..కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటిలో కూడా మాఫియా సామ్రాజ్యం విస్తరిస్తుంది.  తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే నేరాలనే ప్రవృత్తిగా ఎన్నుకుంటున్నారు కొంత మంది దుర్మార్గులు.  ఎదుటి వారి ప్రాణాలు పోయినా తమకు డబ్బు వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు.
Image result for ganjai
గత కొంత కాలంగా హైదరాబాద్ లో రియల్ దందా, హైటెక్ వ్యభిచారం, గన్ కల్చర్, డ్రగ్స్ మాఫియా ఇలా రక రకాల నేరాలకు కేంద్ర బింధువుగా నిలుస్తుంది.  ఈ మద్య హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రగ్స్ సప్లై చేసేవారిని పట్టుకున్నారు. వారు చెబుతున్న వివరాలు పోలీసులనే ఆశ్చర్యం పోందేలా ఉన్నాయి.  ఈ దందాలో స్కూల్ విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, టాలీవుడ్ కి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు.  
Related image
తాజాగా ఇప్పుడు నగరంలో మరో కలకలం చెలరేగింది. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 150 కిలోల వరకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వలవేసి వారిని పట్టుకున్నారు.  వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకొని సు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: