గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించొద్దంటూ మూడేళ్లుగా తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగరువు.. పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.  పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌పార్కు యంత్రాల తరలించాలని గత కొంత కాలంగా వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.

 ఈ రోజుశుక్రవారం తెల్లవారుజాము 5 గంటకు  వందలాది మంది పోలీసులు బిలబిలమంటూ వాహనాల్లోంచి దిగారు.. గ్రామస్తుల ఇళ్ల తలుపులు తట్టి దొరికినోళ్లను దొరికినట్లు లాక్కెళ్లారు.  ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన వారిని వచ్చినట్లు వాహనాల్లోకెక్కించి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.  మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

కొందరి చీరలు లాగేశారు. బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. తుందుర్రులో మహిళలపై మగ పోలీసులు అత్యంత దుర్మార్గంగా విరుచుపడ్డారు. కాళ్లూచేతులూ పట్టుకొని వ్యానులోకి గిరాటేయగా ఓ గర్భిణి తీవ్ర గాయాలపాలైంది.

మహిళల పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించి, లాఠీచార్జి చేసి 20 పోలీసు వాహనాల నడుమ యంత్రాలను ఆక్వా ఫుడ్‌ పార్కుకు చేర్చారు. పేదలను తన్ని తరిమేసిందిగాక వారిపై కేసులు కూడా పెట్టారు. దళితులకు అండగా దేవరపల్లి వెళ్లేందుకు పర్చూరు నుంచి బయలుదేరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును అరెస్టు చేశారు. ఒంగోలులోనూ అఖిలపక్ష నేతలను అరెస్టు చేశారు. రెండు చోట్లా సుమారు 70 మందిని అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: