ఈ మద్య కొంత మంది తమ నిరసనలు చాలా చిత్ర విచిత్రంగా తెలుపుతున్నారు. అయితే ఎదుటి వారు ఎంతటి వారైనా సరే వారి ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వారిని కించ పరుస్తూ నిరసనలు తెలుపుతున్నారు.  తాజాగా ఇలాంటి మార్ఫింగ్ వివాదానికి బలి అయ్యింది ఎవరో కాదు ఒకప్పుడు మహిళా ఐపీఎస్, ప్రస్తుతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి.  గత కొంత కాలంగా పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి, కాంగ్రెస్‌ వర్గానికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Image result for కిరణ్ బేడి
 కాగా ఆమెపై కొంత మంది నిరసన కారులు కిరణ్ బేడిని..నియంత అయిన హిట్లర్ తో పోల్చారు. ఆమె ఫొటోను హిట్లర్ రూపంలోకి మార్చి ఒక పోస్టర్‌ను వేసింది. మరో పోస్టర్‌లో ఆమెను కాళికాదేవిగా, ఇంకొక పోస్టర్‌లో ఆమెను కొందరు తరిమికొడుతున్నట్లుగా చూపించింది.  హిట్లర్‌గా ఆమెను చూపించిన పోస్టర్‌లో ఆమె ఫొటోకు మీసాలు కూడా పెట్టారు. కాళికాదేవిగా చూపించిన పోస్టర్‌లో, ఆమె చేతుల్లో కొందరు నేతల తలలను ఉంచారు.
Image result for కిరణ్ బేడి
ఈ మూడు పోస్టర్లను నగరమంతటా అతికించారు. అసలు విషయానికి వస్తే..జేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వి. స్వామినాథన్, ఆ పార్టీ కోశాధికారి కే జీ శంకర్, ఆ పార్టీకే చెందిన మరో నేత ఎస్ సెల్వగణపతిలను ఎమ్మెల్యేలుగా నియమించింది. ఈ నెల 4న వీరిని కిరణ్ బేడీ నియామక ప్రక్రియ జరిపారు. దీంతో కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, వీసీకే నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  

అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేశారు.  ఈ పోస్టర్లను కిరణ్‌ బేడి తన ట్విటర్‌ ఖాతా ద్వారా బయటపెట్టారు. మనవేలి నిజయోకవర్గ ఎమ్మెల్యే ఆనందరామన్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్‌ను ముంద్రించినట్లు కిరణ్ బేడి ట్వీట్‌లో ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: