టీఆర్ఎస్ ఎంపీ కవిత ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. సోదరుడు కేటీఆర్ కూడా ఎక్కువగా ట్విట్టర్లోనే స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కవిత నోట ట్వట్టర్లో ఉత్తరాంధ్ర మాట వినిపించింది. భారత విదేశాంగ శాఖ ట్విట్టర్లో ఇండియన్ డిప్లొమసీ పేరుతో అకౌంట్ నిర్వహిస్తోంది. భారతీయ భాషలను పరిచయం చేస్తూ ఆ శాఖ కొన్ని గ్రాఫిక్స్ ప్లేట్స్ ను పోస్ట్ చేసింది. దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషలను ఇందులో ప్రస్తావించింది.

Image result for kavitha

తెలుగు భాషకు సంబంధించి.. ఆ శాఖ కొన్ని వివరాలను పొందు పరిచింది. ఆ భాష గొప్పదనాన్ని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేసింది. తెలుగును ద్రవిడ భాషగా పేర్కొంది. భారత్ లోని 6 సంప్రదాయ భాషల్లో తెలుగు ఒకటని వివరించింది. హిందీ, బెంగాల తర్వాత భారతీయులు అత్యధికంగా మాట్లాడుతున్న మూడో భాష తెలుగేనని చెప్పింది. అంతేకాక.. తెలుగులో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మాండలికాలు ఉన్నట్టు తెలిపింది. అయితే.. ఇక్కడే కవిత స్పందించింది. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రస్తావించిన విదేశాంగ శాఖ ప్రయత్నాన్ని తెలుగులో ఉత్తరాంధ్ర కూడా ప్రముఖ మాండలికమని రీట్వీట్ చేసింది.

Image result for kavitha

తెలుగులో వెలువడిన ప్రముఖ పుస్తకాలను ప్రస్తావిస్తూ.. కందుకూరి వీరేశిలింగం రాసిన రాజశేఖర చరిత్రము, విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవృక్షము, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) రాసిన మహా ప్రస్తానంలను పేర్కొంది. అయితే తెలంగాణకు సంబంధించిన ఒక్క రచయితను కూడా విదేశాంగశాఖ ప్రస్తావించలేదు. దీంతో.. కవిత తెలంగాణ రచయితలు – వారు రాసిన గ్రంధాలను పేర్కొంటూ రీట్వీట్ చేసింది.దివంగత కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన విశ్వంభర, వట్టికిట ఆళ్వార్ స్వామి రాసిన ప్రజల మనిషి, దాశరథి రాసిన తిమిరంతో సమరం కూడా ప్రముఖ తెలుగుపుస్తకాలేనని వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: