డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్ లో అతిపెద్ద విషయంగా మారింది. టాలీవుడ్ ఏం ఖర్మ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ విషయం మీదనే డిస్కషన్ లు సాగుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పుడు అందరినీ కూర్చోపెట్టి మరీ కొత్త కొత్త విషయాలు ఇంటరాగేషన్ పేరుతో బయటకి తీసుకుని వస్తోంది. విచారణ ప్రక్రియ పూర్తి అయిన తరవాత కూడా మీడియా కి అటు విచారణ జరపబడిన వ్యక్తి గానీ సిట్ గానీ విచారణ గదిలో ఏం జరిగింది అనేది చెప్పడం లేదు.


కానీ మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా చాలా పెద్ద పేర్లు బయటకి వస్తున్నాయి అంటున్నారు. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయి అని తేలుతూ ఉండడం, అకున్ సబర్వాల్ కూడా చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నట్టు కనపడ్డంతో డ్రగ్స్ కి సంబంధించి దాదాపు ముప్పై ఇండస్ట్రీ జనాలకి కంటిమీద కునుకు ఉండడం లేదు అనేది టాక్. అధికారా వ్యవస్థ అంత గట్టిగా ఉంటె ప్రభుత్వం , ప్రజలు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి . కానీ అలా జరగడం లేదు ఇక్కడ .



గత అనుభవాలు సైతం పరిగణ లోకి తీసుకుంటే త‌ప్పు చేసిన వారు పెద్ద కుటుంబాల వారు, ఛ‌రిష్మా ఉన్న‌వారూ కావ‌డంతో క‌చ్చితంగా ప్ర‌భుత్వంపై ఒత్తిడుంటుంది. ఇది ఒక్క తెలంగాణ‌కే ప‌రిమితం కాదు.. ఏపీపై కూడా ప్ర‌భావం చూపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్‌లో అధికులు ఆంధ్ర ప్రాంతీయులు. కొత్త రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర‌వాతా రేపైనా టాలీవుడ్ త‌న వేదిక‌ను అమ‌రావ‌తికి మార్చుకుంటుందేమోన‌నే అనుమానాలు ప‌క్క రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఉండ‌క‌పోవు. ఇక్క‌డ స‌మ‌స్య అది కాన‌ప్ప‌టికీ కేసీఆర్ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న అంశ‌మే.
అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా ఇందులో ఇన్వాల్వ్ అవుతోంది అనీ అధికారులకి వార్నింగ్ లు సైతం వస్తున్నాయి అనే విషయం కలకలం రేపుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: