Image result for indo china war america warning



భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సిక్కిం మరియు ఇతర ప్రాంతాల సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి సీరియస్గా స్పందించింది. యుద్ధానికి దిగితే ఇరుదేశాలకు నష్టమేనని, నేరుగా చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం ఇరుదేశాలను హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ శాఖ అధికార ప్రతినిధి "గ్యారీ రోస్" ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగుదేశం చైనా దురాక్రమణలను ఏమాత్రం సహించేది లేదని భారత్ పలుమార్లు సందేశాలు పంపినా ప్రయోజనం లేకపోయింది.  చైనా పదే పదే సరిహద్దు విషయాల్లో కయ్యానికి కాలుదువ్వడాన్ని ఆమెరికా సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.


Image result for indo china war america warning



సిక్కింలోని డోక్లామ్ లో చైనా రోడ్డు నిర్మించ తలపెట్టడంతో భారత్ రంగంలోకి దిగి వారి ఆధిపత్యాన్ని అడ్డుకుంటోంది. గత నెల నుంచి చైనాను పలుమార్లు హెచ్చరించినా వెనక్కి తగ్గకపోగా, సరిహద్దు వివాదానికి ఆజ్యం పోస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని భావించిన పెంటగాన్ బృందం చైనా ప్రభావాన్ని తగ్గించే యత్నాల్లో నిమగ్నమై ఉందని ఒక ఊనతస్థాయి సైనికాధిపతి కమాండర్ చెప్పారు. చైనా తమ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సరిహద్దు దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తుందని గ్యారీ రోస్ చెప్పారు.


చైనా అధ్యక్షటన ఫుజియన్ రాష్ట్రం లోని "జియామన్" లో ఆగష్ట్ 31 నుండి సెప్టెంబర్ 4 వరకు జరగనున్న జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు "అజిత్ దోవల్" హాజరుకానున్నారు. ఆ పర్యటనలో భాగంగా డోక్లామ్ వివాదంపై చైనా ప్రతినిధులతో దోవల్ చర్చించనున్నట్లు సమాచారం. నేరుగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చించి, సామరస్యపూర్వకంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేని పక్షంలో ఇరుదేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది.


Image result for indo china war america warning


మరింత సమాచారం తెలుసుకోండి: