ర‌విప్ర‌కాశ్ ఆధ్వ‌ర్యంలోని టీవీ-9పై మ‌రోసారి హాట్ హాట్ చ‌ర్చ మొద‌లైంది. టీవీ-9 అమ్మకానికి రెడీ అయింద‌నేది లేటెస్ట్ టాక్. నిజానికి ఈ చాన‌ల్‌ను అమ్మేస్తార‌ని, రేటు కూడా కుదిరింద‌ని, చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని, ముహూర్తం కూడా కుదిరింద‌ని, ఇలా అనేక వార్త‌లు గ‌తంలోనే వ‌చ్చాయి. అయితే, ఆ ప్ర‌తిపాద‌నలు ముందుకు జ‌ర‌గ‌లేదు. అయితే, ఇప్పుడు తాజాగా వ‌చ్చిన ప్ర‌చారం ప్ర‌కారం చూస్తే.. టీవీ-9 అమ్మ‌కం దాదాపు పూర్త‌యిపోయింద‌ట‌.కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అండ్ కో స‌పోర్టుతో న‌డుస్తున్న‌ రిప‌బ్లిక్ టీవీ యాజ‌మాన్య‌మే దీనిని కూడా కొనుగోలు చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. వీరి మ‌ధ్య డీల్ కూడా 500 కోట్ల‌ని అంటున్నారు.


అర్నాబ్ గోస్వామి రిప‌బ్లిక్ టీవీలో వాటాదారుగా ఉన్నారు. ప్ర‌సారాల‌ ప్రారంభంతోనే రిప‌బ్లిక్ తెర‌పై సంచ‌ల‌నాల‌ను ఆవిష్క‌రించారు. నంబ‌ర్ వ‌న్ రేటింగ్ అందుకున్నారు. ఇక‌ రాజ్య‌స‌భ స‌భ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా రిప‌బ్లిక్ టీవీలో భాగ‌స్వామిగా ఉన్నారు. ఇప్పుడు ఈయ‌నే టీవీ-9ని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార‌ని టాక్. రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌కు చెందిన సంస్థ ఏషియా నెట్ న్యూస్ ఆన్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఎన్ వోపీఎల్) ద్వారా టీవీ-9ని కొనుగోలు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారట‌.

కేంద్రంలోని బీజేపీకి ద‌క్షిణాదిలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో కుదిరితే సొంతంగా లేక‌పోతే.. పొత్తు పెట్టుకుని సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లు సాధించాల‌ని త‌ద్వారా క‌మ‌ల వికాసం జ‌రిగించాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే టీవీ-9 కొనుగోలుపై ఆస‌క్తిగా ఉన్న‌ర‌నే టాక్ వినిపిస్తోంది. రిప‌బ్లిక్ టీవీ ఇప్పుడు బీజేపీకి బాగా ఉప‌యోగ ప‌డుతోంది. మోదీపై ప్ర‌త్యేక క‌థ‌నాల‌తోపాటు కేంద్రాన్ని వెనుకేసుకువ‌స్తూ.. ప్ర‌చారం చేస్తోంది. ఇప్పుడు ఇదే టీమ్ టీవీ-9తో తెలుగు రాష్ట్రాల్లో విజృంభించాల‌ని చూస్తోందని సోషల్ మీడియా చ‌ర్చ మొద‌లైంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: