మహా కూటమి ప్రభుత్వానికి కష్టకాలం మొదలైంది. అవినీతి ఆరోపణల్లో మునిగిపోయిన తేజస్వీ యాదవ్ రాజీనామా చేస్తే కానీ మహాకూటమి ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేదు అంటూ నితీష్ కుమార్ రాహుల్ గాంధీ కి తేల్చి చెప్పేశారు. " అవినీతో ఆరోపణల్లో చిక్కుకుని ప్రస్తుతం సీబీఐ విచారణ ని ఎదురుకొంటూ ఉన్న తేజస్వి ఈ కూటమి లో ఉంటె కూటమి కే ప్రమాదం అని ఫీల్ అవుతున్న నితీష్ ఈ విషయం రాహుల్ గాంధీ ని స్వయంగా కలిసి మరీ గట్టిగా తెలియజేసారు.


ఈ విషయం లో లాలూ తో కూడా నితీష్ ఇప్పటికే మాట్లాడారు.కొడుకు చేత రాజీనామా చేయించేలా చూడాలని నితీశ్ కోరినట్టు తెలుస్తోంది. రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశమైన నితీశ్, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని కూడా చెప్పుకొచ్చారు. " అంటూ బీహార్ లోని మన క్లోజ్ సోర్స్ లు చెబుతున్నాయి. ఈ నెల 28 న బీహార్ అసంబ్లీ సమావేశం అవ్వబోతూ ఉండగా ఆ రోజుకి తేజస్వి నుంచి ఇబ్బందులు తలెత్తే సమస్యే లేదు అని లేదంటే మాత్రం బీజేపీ లాంటి వాళ్ళతో గట్టిగా తలనొప్పులు ఫేస్ చెయ్యాలి అనీ అది తనకి ఇష్టం లేదు అనీ చెప్పుకొచ్చారు నితీష్.


లాలూ కుటుంబంపై సీబీఐ పలు కేసులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న వేళ, పలు అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి, కుమారుడు మీసా తదితరులపైనా కేసులు విచారణ దశలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: