బెంగళూరు పరప్పన అగ్రహర జైలు లో ఉంటున్న శశికళ మీద అనేక ఆరోపణలు వింటూనీ ఉన్నాం. జిల్లా శాఖ నుంచి ఈ మధ్యనే ట్రాఫిక్ కి బదిలీ అయిన డీఐజీ రూప మళ్ళీ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. తాజాగా ఒక తమిళ పత్రికకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో శశికళ అసలు జైలు లోనే ఉండడం లేదు అనీ ఎదురుగా ఉండే ఒక అపార్ట్మెంట్ లో ఆమె ఉంటోంది అని చెప్పుకొచ్చారు ఆమె.


" నాకు ఆ విషయం ఎప్పుడో తెలిసింది కానీ చెబితే ఎవరూ నమ్మరు. ఆమె జైలు కి సరిగ్గా ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటూ ఉంటారు. నా సోర్సెస్ ద్వారా నాకు ఆ విషయం తెలిసి నెల రోజులు దాటుతోంది కానీ ఆమెని పట్టుకోవడం రెడ్ హ్యాండెడ్ గా ఉండాలి. వీడియో లు ఫోటోలు రూపం లో కాకుండా లైవ్ లో ఆమెని పట్టుకోవాలి. కానీ కుదరలేదు.


ఆ టైం కి ఏదో ఒకటి నాకు అడ్డం వచ్చేది.ఆమె స్వయంగా పట్టుబడి వుంటే నేను  తీసుకునే చర్యలు భయంకరంగా ఉండేవి  " అంటూ చెప్పుకొచ్చారు రూప. " అసలు ఆమె జైలు కి వచ్చిన రోజు నుంచీ ఒక్క పని కూడా చెయ్యలేదు.యాపిల్ ఐ ఫోన్ ఎప్పుడూ ఆమె చేతిలో ఉంటుంది. ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఆమె జైలు ఆహారం తినలేదు. కాస్ట్లీ చీరలు చూదీదార్ లూ వేసుకుంటుంది ఆమె " అన్నారు రూప.

మరింత సమాచారం తెలుసుకోండి: