తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఫిరాయింపు కుదుపు ని ఎదురుకోబోతోందా ? ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఇది నిజమే అని చెప్పచ్చు. గవర్నర్ కోటా లో ఇన్నాళ్ళ తరవాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు రామ సుబ్బా రెడ్డి. ఫిరాయింపుల నేపధ్యం లో ఆది నారాయణ రెడ్డి వైకాపా నుంచి టీడీపీ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆ తరవాత మంత్రి కూడా అయ్యారు.


ఆ దెబ్బతో జమ్మలమడుగు లో రామ సుబ్బారెడ్డి వర్గం ఒదటి నుంచీ వ్యతిరేకంగా ఉంది. ఆది నారాయాణ రెడ్డి ని టీడీపీ లో జేరకుండా రామ సుబ్బారెడ్డి చాలా ప్రయత్నాలు చేసారు, కానీ చంద్రబాబు ఇవన్నీ కేర్ చెయ్యలేదు. ఈ విషయం మీద రామ సుబ్బా రెడ్డి చాలా సీరియస్ ఉన్నారు. రామ‌సుబ్బారెడ్డిని బుజ్జ‌గించ‌డం కోసం ఏదో ఒక కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పారు. కానీ, త‌రువాత ఎమ్మెల్సీ ప‌ద‌వి కావాల‌ని మెలిక పెట్టారు. ఏదైతేనేం, అనుకున్న‌ది సాధించుకున్నారు.


కానీ, ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి! వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి రామ సుబ్బారెడ్డి కి టికెట్టు రాదు అని చెప్పేయచ్చు, ఇప్పటికే మంత్రిగా ఉన్న ఆది నారాయణ రెడ్డి ని కాదు అని రామ సుబ్బారెడ్డి కి టికెట్ ఇవ్వడం జరిగే పని కాదు. ఈ ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వైకాపా కూడా సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. రామ‌సుబ్బారెడ్డి వైకాపాకు వ‌స్తే, ఆయ‌న‌కు సీటు ఇచ్చేందుకు పార్టీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: