రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 10 రాజాజీ రోడ్ లో అతి పెద్ద బంగళాను ప్రభుత్వం కేటాయించింది. అందులోనే ప్రణబ్ తన తర్వాతి ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. రెండస్తులుండే ఈ భవనంలో 8 గదులున్నాయి. 340 గదులుండే రాష్ట్రపతి భవన్ నుంచి ప్రణబ్ ఈ 8 గదులున్న భవంతిలోకి మారనున్నారు. అయితే దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఈ భవనంలోనే గడపడం విశేషం. కలాం మరణించిన తర్వాత ఆ బంగళాలో టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు కేటాయించారు. ఇప్పుడాయనకు వేరే భవంతి ఇచ్చారు.

 Image result for pranab mukherjee new building

మొత్తం 11వేల 776 చదరపు అడుగుల్లో ఈ భవనం నిర్మితమైంది. ప్రణబ్ కోసం భవనం మొత్తాన్ని రెనోవేషన్ చేశారు. కొత్తగా పెయింట్స్ వేశారు. ఫర్నిచర్ మొత్తాన్ని మార్చేశారు. వచ్చే, పోయే మార్గాల్లో కొత్త నేమ్ ప్లేట్లను అమర్చారు. భవనం మొత్తాన్ని ఫర్నిచర్ తో నింపేయకుండా.. స్పేసియస్ గా ఉండేటట్లు తీర్చిదిద్దారు. ఓ పెద్ద గదిలో లైబ్రరీని ఏర్పాటు చేశారు.

 Image result for pranab mukherjee new building

2012లో రాష్ట్రపతి భవన్ లో అడుగుపెట్టిన తర్వాత రిటైర్మెంట్ వరకూ తాను ఎదుర్కొన్న అనుభవాలపై ప్రణబ్ ఓ పుస్తకం రాయనున్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన నెలకు రూ.1,50,000 జీతం తీసుకునేవారు. రిటైర్మెంట్ తర్వాత ఆయనకు అందులో సగం.. అంటే రూ.75 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. ఓ కారు, రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు, ఓ మొబైల్ ఫోన్ ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తుంది. ఆఫీసు సిబ్బందికోసం ఏడాదికి రూ.60 వేల రూపాయలు ఇస్తుంది.

 Image result for pranab mukherjee

అంతేకాకుండా ఇండియాలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రణబ్ తో పాటు మరొకరికి కూడా ఈ సదుపాయం లభిస్తుంది. ఆయన ప్రయాణించే విభాగంలో హైక్లాస్ సర్వీసును పొందవచ్చు. ఆయనకు ఎలాంటి వైద్యమైనా ఉచితం. సాధారణంగా మాజీ రాష్ట్రపతులకు టైప్ 8 వసతి లభిస్తుంది. దీని ప్రకారం వైద్యం, వసతి, వాహనం, ఫోన్, ప్రయాణం, విద్యుత్, నీరు ఉచితగా లభిస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: