సాధారణంగా జన్యు లోపం వల్ల కొన్ని జీవరాశులు వింత ఆకారాలతో పుడుతుంటాయి. ఇది మనుషుల్లో కూడా జరుగుతుంది..ఒకే శిశువుకి రెండు తలలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఇలా రక రకాలు గా పుడుతుంటారు.  కొన్ని జంతువుల్లో కూడా వింత ఆకారలతో పుడుతుంటాయి. అయితే ఇలా పుట్టిన జంతువులు దాదాపుగా చనిపోతున్న సంఘటనలే ఎక్కువగా జరిగాయి.  తాజాగా ఓ మేక పిల్ల  చాలా వింతైన ఆకారంలో పుట్టింది.  దాన్ని చూసి ప్రజలు  జడుసుకుంటున్నారు.  
Image result for goat face
ఈ సంఘటన అర్జెంటీనాలోని శాన్ లూయిస్ లో జరిగింది.  ఆ మేక పిల్ల నిజంగా గ్రాఫిక్స్ లో చూపించినట్లు చాలా భయంకరమైన ఆకారంలో ఉంది. పెద్ద పెద్ద కళ్లు..అవి కూడా లోపలికి కుచించుకుపోయి ఉన్నాయి.  ఇక దాని ముఖం కూడా మేక పిల్ల మాదిరిగా కాకుండా గుండ్రంగా కనిపిస్తూ ఓ వింతైన మనిషి ఆకారంలో కనిపిస్తుంది.  దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి మేకపిల్లను గమనించి..వారూ ఆశ్చర్యపోరాు.  
Image result for goat face
కానీ దాని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అది సామాన్యమైన సాదు జంతువే  అని కేవలం ముఖాకృతి మాత్రమే అలా ఉందని మిగతా భాగం అంతా మేకపిల్లను పోలి ఉందని అన్నారు.  ఇక వెటర్నీ డాక్టర్లు సైతం ఇలాంటి ఆకారాలు జన్యులోపం వల్ల జరుగుతుంది..అది రాక్షస మేక పిల్ల అని ప్రజలు భ్రమిస్తున్నారని కొట్టిపడేశారు. ఈ మేకపిల్ల ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: