భారత దేశం లో ఇప్పటికే అతిపెద్ద టెలీకాం విప్లవం మొదలు పెట్టింది జియో .. జియో సిం కార్డు ల పేరుతో మొదలైన విప్లవం అంతా ఇంతా కాదు. అన్ని నెట్వర్క్ లూ బిత్తర పోయేలా గత ఏడాది ఫ్రీ కాలింగ్ , ఫ్రీ వైఫై అంటూ అడుగు పెట్టిన జియో భారత దేశ చరిత్ర లోనే అతి తక్కువ రేటు కి సిం కార్డులు అందించింది. ఇప్పుడు జియో ఫోన్ లు అంటూ కొత్త గా సెల్ ఫోన్ లు సైతం ఫ్రీ గా అందిస్తూ (పదిహేను వందల డిపాజిట్) జియో కొత్త చరిత్ర రాస్తోంది. ఈ సెల్ ఫోన్ లో వచ్చే నెల నుంచీ అందుబాటులోకి రాబోతూ ఉండగా జియో అవుట్ లెట్ లలో ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారికి ఇవి అందిస్తారు.


ఇవన్నీ చాలవు అన్నట్టు జియో ఇప్పుడు మరింత గొప్ప అడుగు వేస్తోంది. దేశం లో ఉన్న దాదాపు మూడు కోట్ల కళాశాల విద్యార్ధులకి ఫ్రీ వై ఫై ని అందించే ఆలోచన చేస్తోంది జియో. ఈ విష‌యంపై ప్ర‌భుత్వ అనుమ‌తి కోరుతూ మాన‌వ వ‌న‌రుల శాఖ‌కు రిల‌య‌న్స్ వారు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా వై-ఫై క‌నెక్టివిటీ ద్వారా 38,000 క‌ళాశాల‌ల‌ను అనుసంధానించ‌నున్నారు.


మానవ వనరుల శాఖ ఈ విషయమై రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు. కానీ ఇతర టెలీకాం ఆపరేటర్ లు మాత్రం తీవ్రంగా కుదేలు అవుతారు. అందుకోసం ఈ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే  టెలికాం ఆప‌రేటర్ల ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ టెండ‌ర్‌పై పార‌ద‌ర్శ‌కంగా నిర్ణయం తీసుకోబోతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: