ప్రపంచంలో ఇప్పుడు ఉగ్రవాదులు ఎక్కడ ఏ రూపంలో రెచ్చిపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.  ముఖ్యంగా అరబ్ దేశాలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఉగ్రదాడులు అవుతున్నట్లు వార్తలు చూస్తునే ఉన్నాం. భారత దేశంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఉగ్ర వాదుల నుంచి ముప్పు ఉందని ఇంటిలీజెన్స్ హెచ్చిరిస్తూనే ఉన్నారు. అదే రీతిలో ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు.  ఈ దాడుల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి.
Image result for punjab CM Shahbaz Sharif Lahore bomb blast
తాజాగా పాకిస్థాన్ లాహోర్‌లోని పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ నివాసానికి సమీపంలో సోమవారం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది.  ఉగ్రవాదులకు కేంద్రంగా నిలుస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ లో  మరోసారి నెత్తురోడింది.  ఈ దాడిలో సుమారు 20మంది చనిపోగా, 30మంది గాయపడ్డారు.  అయితే ఈ దాడులు కేవలం పోలీసులను టార్గెట్ చేసుకొని జరిపినట్లు కనిపిస్తుంది. ఉగ్రదాడిలో పోలీసులు సైతం మరణించారు.  
Scene of the blast in Lahore (Image: @Alluring_Will)
ఈ దాడి పంజాబ్ సీఎం, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ ఇంటికి సమీపంలో జరగడం గమనార్హం.  ఆర్ఫా కరీం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లోని రద్దీ మార్కెట్‌లో పేలుడు జరిగింది.  అయితే ఇది కావాలని ఉగ్రవాదులు చేసిన దాడినా..? కాదా ? అన్న విషయం పూర్తిగా నిర్ధారించలేదు.
Related image
కాకపోతే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడి చేసింది తామేనని ప్రకటించలేదు.  అయితే పేలుడు జరిగిన ప్రదేశంలో అక్రమ కట్టడాలన కూల్చివేత కార్యక్రమం జరుగుతుంది.  పేలుడు ధాటికి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: