రాష్ట్రాన్ని విభజించకుండా అడ్డుకోవాలని చివరి నిమిషం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలను చేశారు. చివరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైఖ్యాంద్ర పార్టీని ఏర్పాటు చేశారు.జై సమైఖ్యాంద్ర పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. కానీ, రాష్ట్రంలో ఆయన పార్టీ తరపున ఎవరూ కూడా విజయం సాధించలేదు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే కొంతకాలంగా ఆయన క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. కిర‌ణ్‌కుమార్ చేర‌బోయే పార్టీ ఇదేనంటూ.. బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీ.. ఇలా అన్ని పార్టీల పేర్లు వినిపించాయి. అయితే వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు కిర‌ణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లోకే వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. 

కిర‌ణ్ కుమార్ సన్నిహితులు కూడా ఈ విషయమై అవున‌నే సంకేతాలను ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనతో టచ్‌లో ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగే చేరే విషయమై వచ్చే నెలలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేరగానే ఆయనకు ఏఐసీసీలో కీలకపదవిని కట్టబెట్టేందుకు పార్టీ నాయకత్వం హమీ ఇచ్చిందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై కిరణ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: