కాపుల ఉద్యమం ఎప్పటికప్పుడు భారీగా కదిలించాలి అని ముద్రగడ పద్మనాభం ప్లాన్ చెయ్యడం దాన్ని ప్రభుత్వం భగ్నం చెయ్యడం చూస్తూనే ఉన్నాం. తుని తరహా ఘటనలు జరగకూడదు అనే ఉద్దేశ్యం లో ఈ తరహా ఒత్తిడి ముద్రగడ , కాపు నాయకుల మీద టీడీపీ తీసుకుని వస్తోంది. త్వరలో ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి అంటూ పాదయాత్ర కి ఫిక్స్ అవ్వగా దాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చెయ్యాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. కిర్లంపూడి దాటి ముద్రగడ కనీసం బయటకి కూడా రాకుండా పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.


ఒకపక్క కాపు ఉద్యమ నేతని ఇంట్లోంచి బయటకి రానివ్వకుండా తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలూ ఉపయోగిస్తున్న టీడీపీ ప్రభుత్వం మరొక పక్క తన నాయకులతో ఈ వ్యవహారం లోకి వైకాపా ని లాక్కోస్తోంది. కాపు రిజర్వేషన్ ల విషయం మీద చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండడం కోసం చంద్రబాబు వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నారు అని చెబుతున్న టీడీపీ శ్రేణులు వైకాపా ముద్రగడ కి సపోర్ట్ ఇవ్వడం లో అర్ధం లేదు అన్నారు.


రాజకీయ పరంగా లబ్ది పోందడం కోసం మాత్రమె ఈ రకమైన కక్క్రుత్తి పనులు వైకాపా చేస్తోంది అనేది వారి ఆలోచన. " మేము ఇచ్చిన మాట ప్రకారమే నడుస్తున్నాం . కాపు కార్పరేషన్ పెట్టాం - కమీషన్ కూడా నియమించాం. అర్హత కలిగిన కాపు విద్యార్ధులని ఉన్నత చదువుల కోసం విదేశాలకి పంపించాం. కాపులని టీడీపీ కి దూరం చేసే కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. " అంటూ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు చెప్పుకొచ్చారు 

మరింత సమాచారం తెలుసుకోండి: