ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు గురించి ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ గా ఉంది. ఇండస్ట్రీ పెద్దలం అంటూ ఎప్పటికప్పుడు హడావిడి చేసేవాళ్ళు కానీ, మా అసోసియేషన్ కానీ ఈ విషయం లో నోరు మెదపడం లేదు. తాజాగా రాం గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మీడియా లో విపరీతమైన కలకలం రేపిన సంగతి తెలిసిందే. రామూ సిట్ ని లక్ష్యంగా చేసుకుని రెండు రోజుల క్రితం తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. ఈ దర్యాప్తు వ్యవహారం కి సంబంధించి రామూ నిన్న రాత్రి చేసిన వ్యాఖ్యలు మీడియా లో సంచలనం రేపుతున్నాయి.


" ఇప్పటి వరకూ కెసిఆర్ పెద్ద గొప్ప నాయకుడు అని ముంబై నుంచి హైదరాబాద్ దాకా మంచి టాక్ ఉండేది. కానీ సిట్ విచారణ కారణంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణా బ్రాండ్ విలువ కూడా దారుణంగా పడిపోయింది. సినిమా వాళ్ళని టార్గెట్ చేసి సిట్ చేస్తున్న విచారణ తెలంగాణా ప్రతిష్ట కే భంగం కలిగేలా ఉంది అని చెప్పాలి. పంజాబ్ కంటే కూడా తెలంగాణా రాష్ట్రం డ్రగ్స్ విషయం లో అధ్వానంగా ఉన్నట్టు ముంబై , డిల్లీ లాంటి నగరాలకి ఈ పరిస్థితి చూస్తే అనిపిస్తోంది.


బాహుబలి సినిమాతో తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని రాజమౌళి అమాంతం పెంచితే... ఆ స్థాయిని అకున్ సబర్వాల్ దేశంలో దిగజార్చారు " అంటూ వర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి రియాక్షన్ అకున్ సబర్వాల్ లేదా ఆయన అధికార బృందం నుంచి రాలేదు కానీ రామూ విషయం లో ఇప్పటి వరకూ సిట్ కోపంగా ఉండగా ఇప్పుడు కెసిఆర్ ని రామూ టార్గెట్ చెయ్యడం తో తెరాస జనాలు కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సెక్షన్ యాభై  - విచారణ కి అడ్డు రావడం అనే నేరం కింద రామూ ని రెండు రోజులు లోపల వెయ్యడమో లేక ఎఫ్ఫైఆర్ నమోదు చెయ్యడమో చేస్తే కానీ సైలెంట్ అయ్యేలా లేడు అని తెరాస - సిట్ వారు ఏకాభిప్రాయం తో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: