తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కొడుకు గానే కాకుండా ఒక మినిస్టర్ గా తనకంటూ సూపర్ పేరు తెచ్చుకున్నారు కేటీఆర్. సోషల్ మీడియా లో విపరీతంగా యాక్టివ్ ఉండే కేటీఆర్ తాజాగా ఆయన పుట్టిన రోజు జరుపుకున్నారు. ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ ఎలాంటి సమస్యకైనా అక్కడ స్పందించడం బాగా అలవాటు ఉన్న మనిషి ఆయన. ట్విట్టర్ వేదిక గా అనేక పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్న కేటీఆర్. సినిమా ప్రముఖుల నుంచి కూడా ఈ విశేష్ అందుకోవడం విశేషం.


సాధారణంగా సినిమావాళ్ళు ఎవ్వరూ ఒక రాజకీయ నాయకుడి పుట్టిన రోజు అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. ఏదో పవన్ కళ్యాణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల జన్మదినోత్సవాలకు మాత్రమే ఈ రేంజ్ హంగామాను సోషల్ మీడియాలో చూడగలం.


దానికి పూర్తి భిన్నంగా కేటీఆర్ బర్త్ డే హడావిడి సోషల్ మీడియా లో జరిగింది. సినీ ప్రముఖులు మధుర శ్రీధర్, సుధీర్ బాబు, దేవిశ్రీప్రసాద్, రకుల్ ప్రీత్ సింగ్, మెహ్రీన్, ప్రియదర్శి, రమణ గోగుల, లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి, థమన్, షెంతిల్ కుమార్, అనిరుద్, శోభు యార్లగడ్డ, అక్కినేని అఖిల్, బ్రహ్మాజీ, ఈషా రబ్బా, మంచు విష్ణు, వెన్నెల కిషోర్, సమంత ఇలా అనేకమంది తమ ప్రేమని ట్విట్టర్ లో కేటీఆర్ కి తెలియజేసారు.


అధికారం ప్రభావం సినిమా జనాల మీద అంతగా ఉందన్నమాట. అధికారం లో ఉన్న నాయకులని కాకా పట్టడం రాజకీయాలలో కామనే కానీ ఈ సారి సినిమా జనాలు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఈయనే గెలుస్తాడు అనే ఉద్దేశ్యం తో నడుస్తున్నారు కాబోలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: