crushed-pill-powder.jpg


ఈ ఘటన అమెరికాలోని ఊటా రాష్ట్రములో చేసుకుంది. అప్పుడే పుట్టిన తమ కూతురుకి కొన్ని గంటలయినా గడవక ముందే ఆ పసికూనకు హెరాయిన్‌ ఇచ్చిన తల్లి దండ్రులను లేసీ క్రిస్టైన్సన్  (26) కోల్బి వెయిల్డ్ (29) పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో నొప్పులను తట్టుకునేందుకు తరచూ హెరాయిన్‌ తో కలిపి డాక్టర్లు సూచించిన మందులను తీసుకునేదని అక్కడి టివి చానల్ "కు టీవి" తమ వార్తల్లో ప్రసారం చేసింది.  


టివి చానల్ "కు టీవి" తెలిపిన వివరాల ప్రకారం  "కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా హెరాయిన్‌కు పూర్తిగా అడిక్ట్‌ అయింది, కొంతసేపటికే మత్తు మందుకోసం ఆరాట పడటముతో హెరాయిన్‌ వినియోగించవలసి వచ్చిందని ఆ మత్తు వినియోగించిన విషయం బిడ్డ ద్వారా ఆసుపత్రి సిబ్బందికి తెలియకూడదని ఆ  దంపతులు  భావించారు. సమయం చూసుకొని ఎవరూ అంటే నర్సు, డాక్టర్లు లేని సమయంలో "సబోక్సోన్‌" అనే ట్యాబ్లెట్లను మెత్తగా పొడి చేసి బిడ్డ దవడ, నాలుక పై రాసినట్లు విచారణలో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దీంతో వారి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు"


Image result for suboxone pills



సెర్జియంట్ స్పెన్సర్ కానన్, ఊటా కౌంటీ అధికారి, మాట్లాడుతూ ఈ తల్లిదండ్రులు నార్కోటిక్ డ్రగ్స్ సరపరా, వినియోగమేకాక, అప్పుడే పుట్టిన పసిపాప జీవితాన్ని ప్రమాదం లో పడేసిన చార్జెస్ తో ఆ నేరాలకు భాధ్యులను చేస్తూ వారిని అరష్ట్ చేసినట్లు తెలిపారు.   


అంతేకాకుండా వారి ఇంటిని సోదాచేయగ అత్యధిక మొత్తములో హేరాయిన్ తదితర నార్కోటిక్ డ్రగ్స్ దొరకటం, ఆయనకు మత్తుమందు సేవించి కార్ డ్రైవ్ చేయటం, వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోవటం వంటి చార్జెస్ తో ఈ కేసు ఆకుటుంబాన్ని చాలా ప్రమాదంలోకి నేట్టివేసింది. ఆ పసిపాపతో పాటు వారి ముగ్గురు కుమారులను పరీక్షలకు పంపగా వారంతా హెరొయిన్ మరియు మోర్ఫిన్ కు పాసిటివ్ అనితేలిందని "కు టివి" కథనం. 


మత్తుమందులెంత ప్రమాదకరమో దానిని అలవాటు పడ్ద వాళ్ల జీవితాలెంత దుర్భరమో డ్రగ్స్ కేసులో సతమత మౌతున్న తెలుగు రాష్ట్రాల వారికి తెలియటానికి ఇది పెద్ద ఉదాహరణ. 


Image result for lacy christinson family from utah usa


మరింత సమాచారం తెలుసుకోండి: