చేపను పట్టి ఇవ్వొద్దు.. చేపలను ఎలా పట్టుకోవాలో నేర్పించండి.. అని పెద్దోళ్లు చెప్పే సామెత చాలా పాపులర్. పాజిటివ్ కోణంలో తీసుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ దీన్నే నెగెటివ్ గా ఎందుకు తీసుకోకూడదనుకున్నాడో ప్రబుద్ధుడు. దీన్ని వెరైటీగా ఆచరణలో పెట్టాడు.

         

         విజయవాడ సమీపంలో నున్న అనే గ్రామముంది. ఆ ఊళ్లో దినేశ్ అనే యువకడున్నాడు. వయసు 20 ఏళ్లు. చదువు మానేసి ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గంజాయి తాగే అలవాటుంది. రోజూ పాయకాపురం వెళ్లి ఓ మహిళ దగ్గర గంజాయి కొని తాగడం అలవాటు చేసుకున్నాడు. ఇతనికి మరికొంతమంది స్నేహితులు కూడా తోడయ్యారు.

 Image result for గంజాయి in eenadu

          వీరందరికీ కామన్ గా సతీశ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో వీరికి ఓసారి గొడవైంది. సీన్ పోలీస్టేషన్ వరకూ వెళ్లింది. అంతే... మనోళ్ల ఆగడాలన్నీ ఒక్కొక్కటిగా బయటరపడ్డాయి. మత్తు కోసం మాత్రలు వాడుతున్నట్టు అంగీకరించారు. మరింత గట్టిగా విచారించడంతో దినేశ్ అతి తెలివి బయటికొచ్చింది. ప్రతిరోజూ గంజాయి కొనడం ఇష్టంలేని దినేశ్.. ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కను పెంచడం మొదలుపెట్టాడు. వనం – మనం ప్రోగ్రామ్ లో భాగంగా చెట్టును నాటినట్లు ఇంట్లోవాళ్లను నమ్మించాడు. ఇంట్లోవాళ్లు కూడా అది మంచి మొక్కేనేమోనని నమ్మారు. కానీ పోలీస్టేషన్ లో ఫ్రెండ్స్ బయటపెట్టేవరకూ ఎవరికీ ఆ విషయం తెలీలేదు పాపం..


మరింత సమాచారం తెలుసుకోండి: